ED ATTACHES OVER RS 7 CR ASSETS OF ACTOR JACQUELINE FERNANDEZ SB
బహుమతులు తీసుకొని అడ్డంగా బుక్కైన స్టార్ హీరోయిన్... రూ.7కోట్ల విలువైన ఆస్తులు జప్తు
బహుమతులు తీసుకొని అడ్డంగా బుక్కైన హీరోయిన్
52 లక్షల విలువైన గుర్రం, 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి, రత్నాలు పొదిగిన చెవిపోగులు మరియు హీర్మేస్ బ్రాస్లెట్ వంటి బహుమతులతోపాటు 1.5 లక్షల డాలర్ల రుణాన్ని కూడా ఆమె తీసుకున్నట్లు అంగీకరించింది.
బాలీవుడ్ ప్రముఖ నటి, స్టార్ హీరోయిన్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ( Jacqueline Fernandez)కు ఈడీ షాక్ ఇచ్చింది. 200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు చెందిన 7.27 కోట్ల రూపాయల ఆస్తిని అటాచ్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ. 7 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
మనీ లాండరింగ్ కేసులో ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌ను విచారిస్తుండగా.. జాక్వెలిన్ లావాదేవీలు వెల్లడి అయ్యాయి. ఆమె తీసుకున్న కొన్ని బహుమతులతో పాటు ఫిక్సెడ్ డిపాజిట్లను ఈడీ తాజాగా జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు ఫెర్నెండెజ్ను ఈడీ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ప్రముఖులను బెదిరించి భారీ మొత్తం డబ్బులు వసూలు చేసిన చంద్రశేఖర్.. ఆ డబ్బుతో జాక్వెలిన్ బహుమతులు కొని ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడింది. తాను బహుమతులు తీసుకున్న విషయం నిజమేనని ఈడీ అధికారుల ఎదుట జాక్వెలిన్ అంగీకరించింది.
మనీలాండరింగ్ కేసులో 2019లో జైలుకెళ్లిన రాన్‌బాక్సీ మాజీ యజమాని శివిందర్ సింగ్ కుటుంబం నుంచి బలవంతంగా వసూలు చేసిన 200 కోట్ల రూపాయల నగదు నుంచి చంద్రశేఖర్ జాక్వెలిన్ కు 5.71 కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఇచ్చారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.చంద్రశేఖర్ నుండి 52 లక్షల విలువైన గుర్రం, 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి, రత్నాలు పొదిగిన చెవిపోగులు మరియు హీర్మేస్ బ్రాస్లెట్ వంటి బహుమతులతో పాటుగా చంద్రశేఖర్ నుండి 1.5 లక్షల డాలర్ల రుణాన్ని అందుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు సమాచారం. ఆమె ఒక మినీ కూపర్ కారును కూడా సుకేష్ నుండి అందుకుంది. అది ఆమె తర్వాత తిరిగి ఇచ్చిందని తెలుస్తుంది.
రాజకీయ నేత టీటీవీ దినకరన్ ప్రమేయంతో ఐదేండ్ల కిందటి చీటింగ్ కేసులోనూ సుఖేష్‌పై ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి సుఖేష్‌ను ఏప్రిల్ 4న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ వ్యాపారి భార్య నుంచి రూ 215 కోట్లు అక్రమంగా తీసుకున్నందుకు సుఖేష్‌ను గత ఏడాది ఈడీ అరెస్ట్ చేసింది. సుఖేష్‌పై దర్యాప్తులో భాగంగా గత ఏడాది డిసెంబర్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ ఎదుట హాజరవగా దర్యాప్తు ఏజెన్సీ ఆమెను ప్రశ్నించింది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.