DUST STORMS DESTROYED ROCKY AUR RANI KI PREM KAHANI SET DUE TO BAD WEATHER ALIA BHATT AND RANVEER SINGH WEDDING SCENE SHOOTING POSTPONED IN JAISALMER SK
Alia Bhatt: పాకిస్తాన్ నుంచి ఊహించని ముప్పు...ఆగిపోయిన అలియా భట్ 'పెళ్లి'..
అలియా భట్
rocky aur rani ki prem kahani: రాత్రి 11 గంటల సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఇసుక తుఫాన్ పెళ్లి సెట్‌ను ధ్వంసం చేసింది. దాదాపు 2 గంటల పాటు బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ దెబ్బకు మూవీ షూటింగ్ మూడు గంటల పాటు నిలిచిపోయింది
పాకిస్తాన్ (Pakistan) నుంచి ఊహించని ముప్పు ముంచుకొచ్చింది. ఆ దెబ్బకు అలియా భట్ పెళ్లి ఆగిపోయింది. అలియా, రణ్‌బీర్ కపూర్ (Alia bhatt-Ranbir kapoor wedding) పెళ్లి మొన్నే అయింది కదా..? ఆగిపోవడమేంటని అనుకుంటున్నారా? ఆగిపోయింది నిజమైన పెళ్లి కాదు.. సినిమా పెళ్లి..! ఏప్రిల్ 14న అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి కొద్ది మంది ఆప్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఐతే పెళ్లైన వారం రోజులకే.. మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది అలియా. 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ (Rocky aur rani ki prem kahani)' షూటింగ్ కోసం జైసల్మేర్ (Jaisalmer) వెళ్లింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో వీరి వివాహ సన్నివేశం కోసం భారీ సెట్ వేశారు. మరికాసేపట్లో షూటింగ్ మొదలవుతుందనే సమయంలో పాకిస్తాన్ నుంచి అనూహ్యంగా ఇసుక తుఫాన్ వచ్చింది. భారీ ఈదురు గాలులు విరుచుకుపడడంతో సెట్ మొత్తం ధ్వంసమయింది.
జైసల్మేర్‌లో బుధవారం రాత్రి 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' సినిమా షూటింగ్ ఓ ప్రైవేట్ హోటల్లో ప్రారంభమైంది. మరుసటి రోజు రణ్వీర్ సింగ్, అలియా భట్ల పెళ్లి షాట్లను చిత్రీకరించాల్సి ఉంది. ఐతే ఒక్కసారిగా వచ్చిన ఇసుక తుపాను ఈ కార్యక్రమానికి బ్రేకులు వేసింది. రాత్రి 11 గంటల సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఇసుక తుఫాన్ పెళ్లి సెట్‌ను ధ్వంసం చేసింది. దాదాపు 2 గంటల పాటు బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ దెబ్బకు మూవీ షూటింగ్ మూడు గంటల పాటు నిలిచిపోయింది. హోటల్ ఆవరణలో వెడ్డింగ్ సెట్‌ను వేశారు. ఇసుక తుఫాన్ ధాటికి పెళ్లి సెట్స్‌లో ఉన్న అద్దాలు సహా పలు విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. సెట్లో వేసిన చెట్టుతో పాటు దానిపై అలంకరణ వస్తువు అన్నీ పాడైపోయాయి. డెకరేషన్ మొత్తం దెబ్బతింది. తద్వారా ఈ చిత్ర దర్శక-నిర్మాత కరణ్ జోహార్ రూ.15 లక్షలు నష్టపోయారు.
తుపాను ఆగిపోయిన తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు హోటల్లోని వేరొక ప్రదేశంలో ఇతర షాట్లను తీశారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం మళ్లీ సినిమా సెట్ వేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత రణ్వీర్ సింగ్, అలియా భట్ల పెళ్లి చిత్రీకరణను పూర్తి చేశారు. కాగా, అలియా, రణబీర్ కపూర్ల వివాహం ఏప్రిల్ 14 న ముంబైలో జరిగింది. రణ్‌బీర్ నివాసం వాస్తులో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
పెళ్లి తర్వాత.. అలియా భట్, రణబీర్ కపూర్ తిరిగి సినిమా పనులను ప్రారంభించారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న 'బ్రహ్మాస్త్ర (Brahmastra)' సినిమాలో అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా కనిపించనున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం ఇదే తొలిసారి. బ్రహ్మాస్త్ర మూవీ ఈ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక అలియా, రణ్వీర జంటగా నటిస్తున్న 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ ఇతర పాత్రాల్లో నటిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.