• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • DURING CORONA LOCKDOWN PERIOD THESE BOLLYWOOD HERO HEROIN STAYING TOGETHER TA

లాక్‌డౌన్‌లో ఒకే ఇంట్లో లాక్ అయిపోయిన హీరో, హీరోయిన్లు..

ప్రతీతాత్మక చిత్రం

ప్రస్తుతం మన దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా అందిరినీ కరోనా మహామ్మారి భయపెడుతోంది. తాజాగా ఈ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కొంత మంది హీరో, హీరోయిన్లు సద్వినియోగం చేసుకుంటున్నారు.

  • Share this:
    ప్రస్తుతం మన దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా అందిరినీ కరోనా మహామ్మారి భయపెడుతోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఓసారి 21 రోజుల పాటులాక్‌డౌన్‌ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని19 రోజులు పొడిగిస్తూ.. వచ్చే నెల 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ప్రజలు కొన్నాళ్లు నిర్భందంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు సినిమా నటులు అందరు ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా ఈ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కొంత మంది హీరో, హీరోయిన్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది నటీనటులు ఇదే సరైన సమయం అనుకొని తమకు నచ్చిన వాళ్లతో ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పటికే కృతి కర్బందా, ఆమె ప్రియుడు పుల్కిత్ ఒకే ఇంట్లో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా  టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ఒకే ఇంట్లో ఉంటున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

    during corona lockdown period these bollywood hero heroin staying together,tiger shroff,disha patani,tiger shroff,disha patani,tiger shroff disha patani,tiger shroff and disha patani,tiger shroff disha patani marriage,tiger disha,tiger disha patani,tiger shroff disha,tiger shroff and disha patani movie,tiger shroff disha patani love story,tiger shroff disha patani tik tok video,tiger shroff disha patani romantic scene,tiger shroff interview,disha patani hot,tiger disha love story,tiger shroff twitter,tiger shroff disha patani dating,bollywod,tollywood,టైగర్ ష్రాఫ్,టైగర్ ష్రాఫ్ దిశా పటానీ,దిశా పటానీ,దిశా పటానీతో టైగర్ ష్రాఫ్,ఒకే ఇంట్లో లాక్‌డౌన్‌లో టైగర్ ష్రాఫ్ దిశా పటానీ
    ఒకే ఇంట్లో ఉంటున్న టైగర్ ష్రాఫ్, దిశా పటానీ (Twitter/Photo)


    టైగర్ ష్రాఫ్‌తో దిశా పటానీ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలె మనస్పర్ధలతో ఒకరికొకరు బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.  ఆ సమయంలో ఆమె ఒక మహారాష్ట్రకు చెందిన ఒక అగ్ర నాయకుడి కుమారుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అతను ఇపుడు ఆ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. అప్పట్లో వీళ్లిద్దరు  కలిసి తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వీరిద్దరు లాక్‌డౌన్ సమయంలో ఒకే ఇంట్లో ఉంటూ ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కరోనా లాక్‌డౌన్ కొంత మంది ప్రేమ జంటలకు మాత్రం మంచి అవకాశంగా దొరికింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: