Home /News /movies /

DURGA WAS THE REAL FATHER FOR MONITHA BABY IN KARTHIKA DEEPAM SERIAL NR

Karthika Deepam: గుడ్ న్యూస్.. మోనిత కడుపుకు కారణం కార్తీక్ కాదు రౌడీ దుర్గా?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో దీప, కార్తీక్ లు వివాహం చేసుకున్న తర్వాత ఓ అనుమానంతో దీపను ఏడేళ్ళు దూరం పెట్టాడు కార్తీక్. మోనిత కార్తీక్ ను పెళ్లి చేసుకోవడానికి, దీపాన్ని దూరం చేయడానికి పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పడంతో అదే ధ్యాసలో ఉన్న కార్తీక్ పిల్లలు పుట్టిన దీపను అనుమానించాడు.

ఇంకా చదవండి ...
    Karthika Deepam: బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో దీప, కార్తీక్ లు వివాహం చేసుకున్న తర్వాత ఓ అనుమానంతో దీపను ఏడేళ్ళు దూరం పెట్టాడు కార్తీక్. మోనిత కార్తీక్ ను పెళ్లి చేసుకోవడానికి, దీపాన్ని దూరం చేయడానికి పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పడంతో అదే ధ్యాసలో ఉన్న కార్తీక్ పిల్లలు పుట్టిన దీపను అనుమానించాడు. ఇక అలా ఎన్నో ఏళ్ళు దీపను బాధ పెట్టిన కార్తీక్ కొన్ని రోజుల కిందట తనకు పిల్లలు పుడతారని విషయం తెలుసుకొని దీప అమ్మతనం గురించి నిజం తెలుసుకున్నాడు. ఇక దీపకు దగ్గరవుతున్న సమయంలో మోనిత వచ్చి కార్తీక్ వల్లే ప్రెగ్నెంట్ అని షాకిచ్చింది. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఈసారి దీప కార్తీక్ ను దూరం పెట్టింది. కానీ కార్తీక్ మాత్రం తప్పు చేయలేదని అనగా.. మోనిత మాత్రం మత్తులో జరిగిందని చెప్పుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మౌనిక ప్రెగ్నెంట్ కు కార్తీక్ కాదని దుర్గ అని తెలిసింది.

    ఆ దుర్గా ఎవరో కార్తీక దీపం అభిమానులు ఈ పాటికే గుర్తుపట్టవచ్చు. గతంలో దీప తప్పు చేసిందని, తనను చంపించడానికి దుర్గా తో కలిసి ప్లాన్ చేయించింది మోనిత. కానీ దుర్గాకు దీప గురించి నిజం తెలిసాక తనను చంపకుండా వదిలేస్తాడు. ఇక అదే సమయంలో మోనిత ను పెళ్లి చేసుకుంటానని వెంటాడాడు. మోనిత మాత్రం కార్తీక్ ప్రేమలో మునిగిపోయి ఉండటంతో దుర్గా ను ద్వేషించింది. ఇక దుర్గా మాత్రం ఉన్నట్టుండి మళ్లీ కనిపించలేదు.

    Karthika Deepamm
    Karthika Deepamm


    ఇక తాజాగా మోనిత కడుపుకు కార్తీక్ కారణం కాదని బయటపడింది. గతంలో మోనిత ను వెంటాడిన దుర్గా అని తెలుస్తుంది. నిజానికి దుర్గా ఎవరో కాదు. మోనిత ఇంట్లో పని మనిషి గా ఉంటున్న ప్రియమణి సోదరుడే దుర్గా. ఇక ప్రియమణి కావాలనే తన సోదరుడు దుర్గా తో కలిసి మోనితను అలా చేయడానికి ప్లాన్ చేసిందట. మొత్తానికి మోనితను దుర్గా చేతిలో చిక్కేలా చేసింది ప్రియమణి. ప్రస్తుతం ఈ విషయం బయటపడటంతో కార్తీకదీపం అభిమానులు మొత్తానికి ఊపిరిపీల్చుకుంటారని తెలుస్తుంది. మరి ఆ తప్పు ఏ సమయంలో జరిగిందో ఎలా బయటపడుతుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Durga, Karthika Deepam serial, Nirupam paritala, Premi vishwanth, Telugu daily serial, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు