Home /News /movies /

DULQUER SALMAN MRUNAL THAKUR RASHMIKA MANDANNA SITA RAMAM TRAILER TALK REVIEW TA

Sita Ramam Trailer Talk : దుల్కర్ సల్మాన్, రష్మికల ‘సీతా రామం’ ట్రైలర్ విడుదల.. యుద్ధంతో రాసిన ప్రేమకథ..

దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Sita Ramam Trailer Talk : దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటించారు. రష్మిక మందన్న మరో ముఖ్య పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    Sita Ramam Trailer Talk Review | దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు. దుల్కర్.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్‌ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్‌ పాత్రలో నటనతో మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దుల్కర్ తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు దుల్కర్. తాజాగా ఈయన తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మరోసారి ‘సీతా రామం’ సినిమాతో పలకరించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి వివిధ పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాగూర్ నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న చేసింది. ఇక ఈ సినిమాతో సుమంత్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈయన భార్యగా భూమిక నటిస్తోంది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.


    ఈ ట్రైలర్ లెఫ్ట్‌నెంట్ రామ్ నాకు ఓ బాధ్యత అప్పగించాడు అనే వాయిస్‌తో స్టార్ట్ అవుతోంది. ఈ ఉత్తరాన్ని సీతా మహాలక్ష్మికి చేర్చే బాధ్యతను రష్మికకు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో సీతా మహాలక్ష్మీని వెతుక్కుంటూ రష్మిక బయలు దేరుతోంది. కానీ రష్మికకు ఆమె  ఆచూకి ఎంతకు తెలియదు. ఈ నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్ రామ్ ఇచ్చిన ఉత్తరం సీతామహాలక్ష్మీకి చేరిందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాను 1960 నేపథ్యంలో పాస్ట్, ప్రెసెంట్‌లో నడస్తూ ఉంటోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాళినీ మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సైనికుడి పాత్రలో ఆకట్టుకున్నారు. కశ్మీర్ విజువల్స్‌, ఫోటోగ్రఫీ బాగున్నాయి.



    ఇందులో  పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌ను మరింత అందంగా మార్చేశాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.  గతేడాది దుల్కర్క ‘కురుప్’ సినిమాను రజినీకాంత్ పెద్దన్నకు పోటీగా విడుదల చేసి మంచి సక్సెస్ సాధించారు.భారతదేశంలో ఎక్కువ కాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన నేరగాడు సుకుమార కురుప్‌ జీవితగాధ ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ చిత్రానికి శ్రీ నాథ్‌ రాజేంద్రన్‌ దర్శకుడు. ఈ క్రైమ్‌ డ్రామాలో ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీవేన్‌, షైన్‌ టామ్‌ చాకో, శోభిత ధూళిపాళ్ల, అనుపమ పరమేశ్వరన్‌, శివజిత్‌ పద్మనాభన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన ‘సెల్యూట్’ అనే సినిమా చేసారు. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ వేదికగా విడుదల చేయడంపై అప్పట్లో కేరళలో నిర్మాతల మండలి దుల్కర్ సల్మాన్ సినిమాలపై బ్యాన్ విధిస్తున్నట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dulquer Salmaan, Rashmika mandanna, Sita Ramam, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు