• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DULQUER SALMAAN STOPPED BY POLICE FOR WRONG ROUTE DRIVING VIDEO GOES VIRAL SR

Dulquer Salmaan : రాంగ్ రూట్‌లో వెళ్లి పోలీసులకు చిక్కిన స్టార్ హీరో.. వీడియో వైరల్..

Dulquer Salmaan : రాంగ్ రూట్‌లో వెళ్లి పోలీసులకు చిక్కిన స్టార్ హీరో.. వీడియో వైరల్..

Dulquer Salmaan car Photo : Instagram

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు.

  • Share this:
    దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు. దుల్కర్.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్‌ మహానటిలో జెమిని గణేషన్‌గా అందరిని తన నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నాడు. అది అలా ఉంటే దుల్కర్ సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మలయాళం యంగ్ హీరో ట్రాఫిక్ నియమాలు పక్కనపెట్టి రాంగ్ రూట్‌లో వెళ్లిపోయాడట. దీంతో ఆయన కోసం ఎదురుచూస్తున్న పోలీసులు ఓ సిగ్నల్ దుల్కర్‌ను పట్టుకున్నారు. కేరళలోని ఓ చోట సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న హీరో దుల్కర్ సల్మాన్ బ్లూ కలర్ పోర్స్చే కారును తప్పుగా నడుపుతున్నట్లు గుర్తించారు అక్కడి పోలీసులు. దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ట్రాఫిక్ పోలీసు దుల్కర్ దగ్గరకు వెళ్లి హెచ్చరించాడు. దుల్కర్ లైన్ క్రాస్ చేసి రావడం వలన కారును రివర్స్ తీసుకోవాలని చెప్పడంతో.. మొదట్లో బలవంతం చేసి తర్వాత తన తప్పు అంగీకరించాడు దుల్కర్. ఇక దానికి సంబంధించిన ఆ ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



    ఇక ఆయన తాజా చిత్రం తెలుగులో కనులు కనులను దోచాయంటే ఆ మధ్య విడుదలై మంచి ఆదరణను పొందింది. దుల్కర్ తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు దుల్కర్.

    ఈ సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'లెఫ్టినెంట్' అనే టైటిల్ని నిర్ణయించింది. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... 1964 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనున్నది.

    ఇందులో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ కనిపించనున్నారు. అందులో భాగంగా ఫస్ట్ లుక్ లో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ పెట్టింది చిత్రబృందం. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలకానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు