Home /News /movies /

DULQUER SALMAAN RASHMIKA MRUNAL THAKUR SITA RAM MOVIE REVIEW SENSIBLE LOVE EPIC TA

సీతా రామం (Sita Ramam)
సీతా రామం (Sita Ramam)
3/5
రిలీజ్ తేదీ:5/8/2022
దర్శకుడు : హను రాఘవపూడి (Hanu Raghavapudi)
సంగీతం : విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandra Shekhar)
నటీనటులు : దుల్కర్ సల్మాన్, సుమంత్,మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న,మురళీ శర్మ,వెన్నెల కిషోర్ తదితరులు..
సినిమా శైలి : లవ్ వార్ డ్రామా (Love War Drama )
సినిమా నిడివి : 2Hr 30M

Sita Ramam Movie Review : ’సీతా రామం’ మూవీ రివ్యూ.. హృదయాలకు హత్తుకునే ప్రేమ యుద్ధం..

 సీతా రామం మూవీ రివ్యూ (Twitter/Photo)

సీతా రామం మూవీ రివ్యూ (Twitter/Photo)

Sita Ramam Movie Review :దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటించారు. రష్మిక మందన్న మరో ముఖ్య పాత్రలో నటించారు. సుమంత్ మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది.  మరి సెన్సిబిల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి.. హీరో దుల్కర్ సల్మాన్‌‌కు ఈ సినిమాతో సక్సెస్ అందించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
రివ్యూ : సీతా రామం   (Sita Ramam)
నటీనటులు : దుల్కర్ సల్మాన్, సుమంత్,మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న,మురళీ శర్మ,వెన్నెల కిషోర్ తదితరులు..
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, శ్రేయాస్ కృష్ణ
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాత : చలసాని అశ్వనీదత్
సంగీతం: హను రాఘవపూడి
విడుదల తేది : 5/8/2022

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటించారు. రష్మిక మందన్న మరో ముఖ్య పాత్రలో నటించారు. సుమంత్ మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది.  మరి సెన్సిబిల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి.. 1960 బ్యాక్ డ్రాప్‌లో యుద్ధంతో రాసిన కథ అంటూ టాగ్ లైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి ఆ టాగ్ లైన్‌కు తగ్గట్టు  హీరో దుల్కర్ సల్మాన్‌‌కు ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

అఫ్రీన్  (రష్మిక మందన్న) లండన్‌‌కు చెందిన్ ఓ యూనివర్సిటీలో  పాకిస్థాన్ స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా ఉంటోంది.ఈ నేపథ్యంలో రష్మిక కు తన తాత (సచిన్ ఖేడ్కర్) ఆస్తి కోసం ఒక ఉత్తరాన్ని మన దేశంలో హైదరాబాద్‌లో ఉండే సీతా మాలక్ష్మి(మృణాల్ ఠాకూర్) కి చేరవేసే బాధ్యత అప్పగిస్తాడు. ఈ నేపథ్యంలో అఫ్రీన్‌కు ఇండియన్ ఆర్మీ లెఫ్ట్‌నెంట్ రామ్ ( దుల్కర్ సల్మాన్‌), సీతాల ప్రేమ కథ గురించి తెలుస్తోంది.

కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే..

దర్శకుడు హను రాఘవపూడి తాను అనుకున్న ఓ మాములు ప్రేమకథకు యుద్ధ నేపథ్యం జోడించి తనదైన స్క్రీన్‌ప్లే‌తో  నిర్మాత అశ్వనీదత్‌ను మెప్పించడంలో తొలి సక్సెస్ అయ్యాడు. హను రాఘపూడికి ఇలాంటి సెన్సిబుల్ ప్రేమకథలను హ్యాండిల్ చేసే విధానం మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. స్లో నేరేషన్ ఒక వర్గపు ప్రేక్షకులకు అసహనం కలిగించినా..ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్ మనసు చూరగొన్నాడు.  మొత్తంగా ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్.. ప్రీ క్లైమాక్స్ సహా పతాకపు సన్నివేశాలను తనదైన శైలిలో హృద్యంగా తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు పి.ఎస్.వినోద్, శ్రేయాస్ కృష్ణ ఫోటోగ్రఫీ బాగుంది. కశ్మీర్ అందాలు, వార్ సన్నివేశాలు.. ఫారెన్ లొకేషన్స్ అన్ని బాగున్నాయి. ఎడిటర్ తన పనికి ఇంకాస్త పదును పెడితే బాగుండేది.  ఈ సినిమాకు నేపథ్య సంగీతంతో పాటు పాటలు క్యాచీగా ఉన్నాయి. వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

దుల్కర్ సల్మాన్ గతంలో తెలుగులో మహానటిలో జెమిని గణేషన్ పాత్రలో తనదైన నటన ప్రదర్శించాడు. ఈ సినిమాలో లెఫ్ట్‌నెంట్ రామ్ పాత్రలో అతను తప్పించి మరొకరికి ఊహించుకోవడం కష్టం అనే రీతిలో మెప్పించాడు. ఆ పాత్రకు తాను తప్పించి మరే నటుడు న్యాయం చేయలేనంత ఇదిగా ఆ పాత్రలో ఒదిగితీరు బాగుంది. ఇక సీతామాలక్ష్మిగా ఆమె పాత్ర ఈ సినిమాకు కీలకం. అమాయకమైన పాత్రలో మెప్పించింది. రష్మిక మందన్న తన క్యారెక్టర్‌కు న్యాయం చేసింది. ఒక కల్నల్ విష్ణు శర్మగా సుమంత్ పాత్ర బాగుంది. మొత్తంగా మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ 

దుల్కర్ సల్మాన్ నటన

కథ, డైరెక్షన్స్

ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు..

మైనస్ పాయింట్స్ 

ఫస్టాఫ్

స్లో నేరేషన్

ఎడిటింగ్

చివరి మాట : హృదయాలకు హత్తుకునే సెన్సిబుల్ లవ్ స్టోరీ

రేటింగ్ : 3/5
Published by:Kiran Kumar Thanjavur
First published:

రేటింగ్

కథ:
3/5
స్క్రీన్ ప్లే:
3/5
దర్శకత్వం:
3/5
సంగీతం:
3/5

Tags: Ashwini Dutt, Dulqer Salmaan, Hanu Raghavapudi, Rashmika mandanna, Sita Ramam, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు