Home /News /movies /

Dulquer Salmaan - Kurup :భారీ ఎత్తున 1500 స్క్రీన్స్‌లో దుల్కర్‌ సల్మాన్‌ ‘కురుప్’ విడుదల..

Dulquer Salmaan - Kurup :భారీ ఎత్తున 1500 స్క్రీన్స్‌లో దుల్కర్‌ సల్మాన్‌ ‘కురుప్’ విడుదల..

రేపు థియేటర్స్‌లో విడుదల కానున్న ‘కురుప్’ (Twitter/Photo)

రేపు థియేటర్స్‌లో విడుదల కానున్న ‘కురుప్’ (Twitter/Photo)

Dulquer Salmaan - Kurup : దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

  Dulquer Salmaan - Kurup : దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దుల్కర్.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్‌ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్‌ పాత్రలో నటనతో మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దుల్కర్ తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు దుల్కర్. తాజాగా ఈయన ‘కురుప్’ సినిమా చేసారు.

  ఈ సినిమాను రజినీకాంత్ పెద్దన్న తర్వాత మరికొన్ని గంటల్లో 1500 స్క్రీన్స్‌లో విడులవుతున్న రెండో  చిత్రం కురుప్. భారతదేశంలో ఎక్కువ కాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన నేరగాడు సుకుమార కురుప్‌ జీవితగాధ ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ చిత్రానికి శ్రీ నాథ్‌ రాజేంద్రన్‌ దర్శకుడు. ఈ క్రైమ్‌ డ్రామాలో ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీవేన్‌, షైన్‌ టామ్‌ చాకో, శోభిత ధూళిపాళ్ల, అనుపమ పరమేశ్వరన్‌, శివజిత్‌ పద్మనాభన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

  BalaKrishna - Nani : నందమూరి బాలకృష్ణకు నాని మధ్య ఉన్న ఈ అనుబంధం తెలుసా..

  మహమ్మారి కారణంగా సినీ రంగం సంక్షోభంలో పడిన వేళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అట్టహాసంగా విడుదల కాబోతున్న రెండవ దక్షిణ భారత చలన చిత్రం ‘కురుప్‌’. అంతేకాదు, భౌగోళిక సరిహద్దులను అధిగమించిన మొట్టమొదటి మలయాళ చిత్రం కూడా ఇది. దుల్కర్‌ సల్మాన్‌ సొంత నిర్మాణ సంస్ధ వేఫారర్‌ ఫిల్మ్స్‌ తో పాటుగా ఎం–స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సహ నిర్మాతలుగా వ్యవహరించిన ‘కురుప్‌’ చిత్ర విడుదల కోవిడ్‌ కారణంగా పలు మార్లు వాయిదా పడింది. ఓటీటీలో విడుదల చేయాలని భావించినప్పటికీ, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి సలహా మేరకు ఈ చిత్ర నిర్మాతలు థియేటర్‌లో చిత్రం విడుదల చేయాలని నిర్ణయించారు.

  BalaKrishna- Akhanda : ‘అఖండ’ విడుదల తేది ఖరారు.. బాలయ్య సినిమాతో థియేటర్స్‌లో భారీ చిత్రాల సందడి..

  థియేటర్‌లో కురుప్‌ విడుదల చేయాలనే మా నిర్ణయానికి సానుకూల స్పందన వస్తుంది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, సినీ వీక్షకులు మా ప్రయత్నాలను అభినందించడంతో పాటుగా మంచి సినిమాను ఆదరిస్తుడటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆకట్టుకునే కథనంతో రూపుదిద్దుకున్న కురుప్‌, మహమ్మారి అనంతర కాలంలో వెండి తెరపై సినీ వీక్షణ పరంగా ఆసక్తిని రెట్టింపు చేయనుంది దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు.

  Balakrishna Remakes: నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

  దుల్కర్‌ సల్మాన్‌ మరియు శ్రీనాధ్‌ రాజేంద్రన్‌ సంతకం చేసిన ప్రింటెడ్‌ పోస్టర్‌, డిజిటల్‌ ఆర్ట్‌వర్క్‌ సహా మూడు నాన్‌ ఫంగిబల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీలు) విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ చిత్రం ‘కురుప్‌’. ఈ చిత్ర ట్రైలర్‌ను నవంబర్‌ 10వ తేదీన ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవంతి దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా వద్ద ప్రదర్శించారు. తద్వారా ఈ భవంతిపై ప్రదర్శితమైన తొలి మలయాళ చిత్రంగా చరిత్రకెక్కింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Dulquer Salmaan, Kurup Movie, Malluwood, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు