Home /News /movies /

DULQUER SALMAAN AND MRUNAL THAKUR SITA RAMAM TEASER RELEASE SB

Sita Ramam: అందమైన ప్రపంచంలో సైనికుడు రామ్.. సీతారామం టీజర్ రిలీజ్..

Dulquer salmaan Rashimika mandanna movie Sita Ramam gets release date Photo : Twitter

Dulquer salmaan Rashimika mandanna movie Sita Ramam gets release date Photo : Twitter

సీతారామం టీజర్ ఎంతగానో అలరిస్తుంది. యుద్ధం రాసిన ఈ ప్రేమకథలో ఇద్దరు ప్రేమికులు, తమ అందమైన ప్రపంచంలో ఆస్వాదిస్తున్నట్టు టీజర్ లో చూపించారు.

    దుల్కర్ సల్మాన్ టాలీవుడ్‌లో కూడాా మంచి పేరు సంపాదించుకున్న హీరో. తాజాాగా దుల్కర్ సీతారామంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.  హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా సీతారామం అనే రొమాంటిక్ వార్ మూవీ తెరకెక్కుతోంది. అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. 1965 బ్యాక్ డ్రాప్ తో రోహిణి వాయిస్‌ ఓవర్‌ తో టీజర్ ప్రారంభమౌతుంది. సైనికుడు రామ్ గురించి చెబుతుంది. కుటుంబం ఉండదు. తన సహోద్యోగులతో సమయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు.

    ఇంతలో సడెన్ గా లెటర్ అందుకుంటాడు. అది సీతా మహాలక్ష్మి అనే అమ్మాయి రాసిన లెటర్. అందులో ఆమె, తననుతాను రామ్ భార్యగా చెప్పుకుంటుంది. దీంతో రామ్, ఓ అందమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఇక టీజర్ లో హీరోయిన్ మృణాల్ ను అందంగా ప్రజెంట్ చేశారు. యుద్ధం రాసిన ఈ ప్రేమకథలో ఇద్దరు ప్రేమికులు, తమ అందమైన ప్రపంచంలో ఆస్వాదిస్తున్నట్టు టీజర్ లో చూపించారు. హను రాఘవపూడి ఇలాంటి సన్నివేశాలు తీయడంలో స్పెషలిస్ట్. అతడి మేజిక్ టీజర్ లో స్పష్టంగా కనిపిస్తోంది.



    సీతారామం టీజర్ మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో  పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ ను మరింత అందంగా మార్చేశాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటిస్తోంది.  ఇక దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు. ఆయన తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటిలో తన నటనతో మెప్పించారు.

    ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్‌ పాత్రలో ఒదిగిపోయారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దుల్కర్ తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు దుల్కర్
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Dulqer Salmaan, Dulquer Salmaan, Rashmika mandanna

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు