Home /News /movies /

DULQER SALMAAN IN TROUBLES KERALA THEATRES OWNERS BIG SHOCK TO MALLUWOOD STAR HERE ARE THE DETAILS TA

Dulqer Salmaan : చిక్కుల్లో మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. మల్లూవుడ్ హీరోకు సినిమా కష్టాలు..

దుల్కర్ సల్మాన్ (Twitter/Photo)

దుల్కర్ సల్మాన్ (Twitter/Photo)

Dulquer Salmaan - Kurup : దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఈయనపై కేరళ థియేటర్స్ ఓనర్స్ నిషేధం విధించారు.

    Dulquer Salmaan - Kurup : దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దుల్కర్.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్‌ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్‌ పాత్రలో నటనతో మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దుల్కర్ తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు దుల్కర్. గతేడాది ఈయన ‘కురుప్’ సినిమా చేసారు.ఈ సినిమాను రజినీకాంత్ పెద్దన్నకు పోటీగా విడుదల చేసి మంచి సక్సెస్ సాధించారు.

    భారతదేశంలో ఎక్కువ కాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన నేరగాడు సుకుమార కురుప్‌ జీవితగాధ ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ చిత్రానికి శ్రీ నాథ్‌ రాజేంద్రన్‌ దర్శకుడు. ఈ క్రైమ్‌ డ్రామాలో ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీవేన్‌, షైన్‌ టామ్‌ చాకో, శోభిత ధూళిపాళ్ల, అనుపమ పరమేశ్వరన్‌, శివజిత్‌ పద్మనాభన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన ‘సెల్యూట్’ అనే సినిమా చేసారు.

    నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్న దుల్కన్ సల్మాన్ (సెల్యూట్’ (Twitter/Photo)


    ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికీ మన దేశంలో కరోనా ఓమైక్రాన్ రూపంలో విరుచుకుపడటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇందులో  దుల్కర్ సల్మాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ప్యాన్ ఇండియా మూవీస్‌తో పాటు అన్ని సినిమాలు థియేటర్స్‌లో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సెల్యూట్’ చిత్రాన్ని చిత్ర నిర్మాతలు థియేటర్స్‌లో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

    James Movie Twitter Review : పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అప్పుకు ఫ్యాన్స్ ఘన నివాళి..

    మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడంపై ఆగ్రహించిన కేరళ థియేటర్స్ ఓనర్స్.. ఇకపై దుల్కర్ సల్మాన్ సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. మరి థియేటర్స్ ఓనర్స్ నిర్ణయంపై దుల్కర్ ఇంకా స్పందించలేదు. గతంలో సూర్య నటించిన సినిమాలను నేరుగా థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ వేదిక విడుదల చేయడంపై అప్పట్లో తమిళ థియేటర్స్ ఓనర్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆయన సినిమాలను ఇకపై థియేటర్స్‌లో ప్రదర్శించకూడదనే నిర్ణయం తీసుకున్నారు.తీరా .. సూర్య రీసెంట్ మూవీ ‘ET’ మూవీ థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే కదా. అలాగే దుల్కర్ సల్మాన్ సినిమాల విషయంలో థియేటర్స్ ఓనర్స్ నిర్ణయం మారే అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ టీ కప్పులో తుపాను లాంటివనే చెప్పాలి.

    Bollywood Heroes in South: తెలుగు సినిమాల్లో హిందీ హీరోల దందా.. అజయ్, సల్మాన్ సహా సౌత్‌ ఇండస్ట్రీకి క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోలు..


    మరోవైపు మోహన్ లాల్ సినిమాలు ‘దృశ్యం 2’ ‘బ్రో డాడీ’ వంటి చిత్రాలు థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీగా విడుదలయ్యాయి. అప్పట్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో పాటు.. థియేటర్స్‌లో విడుదల చేయకుండా ఎక్కువ రోజులు సినిమా దగ్గర పెట్టుకుంటే.. నిర్మాతలకు తలకు మించిన భారమే. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేసారు. మరి ఇపుడు దుల్కర్ సల్మాన్.. కరోనా కేసులు లేని ఈ టైమ్‌లో  సినిమాను థియేటర్స్‌లో కాకుండా  నేరుగా ఓటీటీ వేదిగా విడుదల ఎందుకు చేస్తున్నారనే థియేటర్స్ ఓనర్స్ ప్రశ్నిస్తున్నారు. దీనికి దుల్కర్ సల్మాన్ ఏ సమాధానం చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dulqer Salmaan, Malluwood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు