హోమ్ /వార్తలు /సినిమా /

‘సైరా’లో రామ్ చరణ్ క్యారెక్టర్ అలా మిస్సైయింది..

‘సైరా’లో రామ్ చరణ్ క్యారెక్టర్ అలా మిస్సైయింది..

తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)

తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)

Sye raa Narasimha Reddy | మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఫస్ట్ టైమ్ చేసిన హిస్టారికల్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు.

ఇంకా చదవండి ...

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఫస్ట్ టైమ్ చేసిన హిస్టారికల్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో ఒక ప్రత్యేక పాత్రను చేయిద్దామనుకున్నాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్‌లో షేర్ ఖాన్ పాత్ర ఉందట. ఈ క్యారెక్టర్ కోసం సల్మాన్ ఖాన్, సంజత్ దత్‌లలో ఒకరితో చేయిద్దామనుకొని చరణ్ అనుకున్నాడట. వాళ్లు కూడా చేయడానికి ముందుకొచ్చారు. కానీ చరణ్‌తో చేయిస్తే బాగుంటుందని మరో అభిప్రాయం యూనిట్‌లో వచ్చింది. కథ ప్రకారం ఈ పాత్రతో సైరా నరసింహారెడ్డి యుద్ధం చేయాలి. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ నాతో నరసింహారెడ్డి.. నీ లాంటి వాళ్లు దేశానికి కావాలంటూ తన చేతిలోని కత్తితో పొడుచుకొని చనిపోతుంది. ఐతే.. నా పాత్ర చేతిలో చరణ్ చనిపోవడం బాగా ఉండదని భావించి. స్క్రిప్ట్ దశలోనే సినిమా లెంగ్త్ తగ్గించే క్రమంలో ఆ ఎపిసోడ్‌ను తీసేసాము. ఆ రకంగా ‘సైరా’లో నటించే ఛాన్స్ రామ్ చరణ్ మిస్ చేసుకున్నాడు.

First published:

Tags: Amitabh bachchan, Bollywood, Chiranjeevi, Ram Charan, Sye Raa Narasimha Reddy Movie Review, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు