లాక్‌డౌన్‌ వల్ల తన ఆత్మీయుడిని మిస్ అవుతున్న తమన్నా..

మన దేశంలో కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ లాక్‌డౌన్ కారణంగా తన ఆత్మీయుడిని మిస్ అవుతున్నానని ట్వీట్ చేసింది.

news18-telugu
Updated: April 25, 2020, 3:09 PM IST
లాక్‌డౌన్‌ వల్ల తన ఆత్మీయుడిని మిస్ అవుతున్న తమన్నా..
తమన్నా (Instagram/Photo)
  • Share this:
మన దేశంలో కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీంతో విదేశాల నుంచి వచ్చే అన్ని విమానాలను, ఓడ ప్రయాణాలను రద్దు చేసింది కేంద్రం. అంతేకాదు రైళ్లు, బస్సులు వంటివి కూడా ఎక్కడక్కడ స్థంభించిపోయాయి. దీంతో చాలా మంది విదేశీయులు భారత్‌లో చిక్కుకు పోయారు. అలానే మన దేశ ప్రజలు చాలా మంది వేరే దేశాల్లో ఉండిపోయారు. అటు ఇటూ రాకపోకలు అన్ని స్థంభించినపోయాయి. ఈ లాక్‌డౌన్ కారణంగా కెనడా దేశంలో ఉన్న తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు సంజయ్ చిక్కుకుపోయాడు. మరోవైపు అమీర్ ఖాన్ కొడుకు కూడా విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా లాక్‌డౌన్ వలన తమన్నా సోదరుడు ఆనంద్ అమెరికాలో ఇరుక్కుపోయాడు. ఈ సందర్భంగా తమన్నా.. తన తమ్ముడితో దిగిన పాత ఫోటోని షేర్ చేసింది. ఆ రోజుల్లో ఇద్దరం అందిరిలాగే ఎంతో గొడవ పడేవాళ్లం. మిస్ యూ ఆనంద్ భాటియా అని క్యాప్షన్ పెట్టింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ అమ్మడు ఇంట్లో వెరైటీ వంటకాలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు కరోనా నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో పని లేకుండా పోయిన కార్మికుల కోసం మూడు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ భామ.. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్’ సినిమాలో నటిస్తోంది. సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో తమన్నా కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది మిల్కీ బ్యూటీ.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 25, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading