ఆయన గొంతు స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు కూడా వినిపిస్తుంది.. వర్మ మరో సంచలన ట్వీట్

రామ్ గోపాల్ వర్మ సెలెంట్‌గా ఉన్న వైలెంట్‌గా తన పని తాను కానిచ్చేస్తూ ఉంటాడు.  ప్రస్తుతం ఆర్జీవి .. సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత రామారావు జీవితంలో ఎదురైన సంఘటనల సమాహారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో మరో పాటను విడుదల చేస్తూ పెద్ద ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

news18-telugu
Updated: February 12, 2019, 2:11 PM IST
ఆయన గొంతు స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు కూడా వినిపిస్తుంది.. వర్మ మరో సంచలన ట్వీట్
రాంగోపాల్ వర్మ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: February 12, 2019, 2:11 PM IST
రామ్ గోపాల్ వర్మ సెలెంట్‌గా ఉన్న వైలెంట్‌గా తన పని తాను కానిచ్చేస్తూ ఉంటాడు.  ప్రస్తుతం ఆర్జీవి .. సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత రామారావు జీవితంలో ఎదురైన సంఘటనల సమాహారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో ‘దోపిడీ దారుల పెత్తనమే ఇక వద్దని చిత్తుగా పడగొడతా’ అంటూ అనే పాట క్లిప్‌ను విడుదల చేశాడు వర్మ.
ఈ పాటను బొమ్మాళి రవిశంకర్ పాడటం విశేషం. అంతేకాదు ఈ పాటను ట్విట్టర్‌లో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ...బొమ్మాళి రవిశంకర్ఈ పాటను అద్భుతంగా పాడాడు. అంతేకాదు స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు కూడా నీ గొంతులోని పవర్ వినిపిస్తోంది అంటూ ట్వీట్ చేసాడు. సిరాశ్రీ రాసిన ఈ పాటకు కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఈ సినిమాను ట్రైలర్‌ను ముందుగా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన రోజునే 24 నిమిషాల తర్వాత రిలీజ్ చేస్తానని చెప్పినా.. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిలది కూడా ట్రూ లవ్ స్టోరీ కాబట్టి  ఈసినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు.సౌందర్య రజనీకాంత్ జీవితంలో ముఖ్యమైన ముగ్గురు మగాళ్లు

ఇవి కూడా చదవండి 

మెగాస్టార్ చిరంజీవితో... దర్శకుడు విజయ బాపినీడు ప్రత్యేక అనుబంధం..

ప్రముఖ సినీ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

‘సైరా’లో చిరంజీవి పక్కన మెరవనున్న అల్లు అర్జున్ !
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...