DRUSHYAM2 OFFICIAL TEASER OUT MOVIE WILL BE RELEASED ON AMAZON PRIME ON 25TH NOVEMBER SK
Drushyam 2: వీడిన సస్పెన్స్.. అమెజాన్ ప్రైమ్‌లో దృశ్యం-2.. ఆ రోజే విడుదల.. అధికారి ప్రకటన
దృశ్యం2లో వెంకటేశ్
Drushyam Teaser: ప్రస్తుతం కరోనా తగ్గినందున దృశ్యం-2 మూవీ థియేటర్లో వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఓటీటీలో మాత్రమే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు.
దృశ్యం (Drushyam).. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం సూపర్ హిట్టయింది. దానికి కొనసాగింపుగా వస్తున్న దృశ్యం-2 (Drushyam-2)పై కూడా ఎన్నో అంచనాలున్నాయి. ఫస్ట్ పార్ట్‌కు మించిన సస్పెన్స్, ట్విస్ట్‌లు ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఐతే ఎప్పుడో షూటింగ్ ముగిసిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఐతే ఎట్టకేలకు దృశ్యం-2 మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇవాళ టీజర్‌ను విడుదల చేసి, చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం కరోనా తగ్గినందున దృశ్యం-2 మూవీ థియేటర్లో వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఓటీటీలో మాత్రమే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. నవంబరు 25న అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో దృశ్యం-2 చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) అధికారికంగా ప్రకటించింది.
టీజర్ ద్వారా చిత్రంపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. వరుణ్ హత్య కేసు మొదటి భాగంతో ముగియలేదు.. మళ్లీ రీ-ఓపెన్ చేశారని స్పష్టమవుతోంది. ఆరేళ్లుగా డిపార్ట్మెంట్ను వేధిస్తున్న ప్రశ్న అంటూ.. ఆ కేసును దృశ్యం-2లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు చూపించారు. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని ఐజీ గీత తన పంతాన్ని కొనసాగించింది. ఆ చీకటి జ్ఞాపకాల్లోకి తమను లాగొద్దని రాంబాబు ఫ్యామిలీ చెబుతున్నా వినదు. ఐతే ఇంతకు ముందు కూడా ఎన్నో సమస్యలు వచ్చి వెళ్లాయని..ఇది కూడా పోతుందని రాంబాబు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ హిట్ చిత్రం ‘దృశ్యం 2’ సినిమాకు ఇది. మొదటి భాగం దృశ్యంని కూడా మలయాళం నుంచే తీసుకున్నారు. అది సూపర్ డూపర్ హిట్ కావడంతో మలయాళంలో సీక్వెల్ తీశారు. అలా వచ్చిన దృశ్యం-2 కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి భాగానికి మించిన సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా సెకండ్ పార్ట్‌ని రిమేక్ చేసి.. అదే పేరుతో విడుదల చేస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ (Venkatesh), మీనా (Meena) ప్రధాన పాత్రల్లో నటించారు. కృతికా జయకుమార్ (Krithika jayakumar), ఎస్తర్ అనిల్ (Esther Anil), నరేష్ (Naresh), నదియా (Nadiya) ఇతర పాత్రలను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.