టాలీవుడ్ డ్రగ్స్ (Tollywood Drugs Case) కేసుకు సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం అంటే ఈరోజు (Puri Jagannadh ) డైరెక్టర్ పూరీజగన్నాథ్ ఈడి విచారణకు హాజరయ్యారు. కుమారుడు ఆకాష్ పూరీతో ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుండగా, తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు. పూరీ ఉదయం 10.30 గంటలకు హాజరు కావాల్సి ఉండగా.. 10.05 గంటలకే వచ్చారు. ఈ సందర్భంగా మీడియా మాట్లాడాలనీ ప్రయత్నించింది. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం స్పందించలేదు. కారు దిగి నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ (enforcement directorate) ఆఫీసులో ఈ విచారణ మధ్యాహ్నం వరకు విచారణ సాగనుందని తెలుస్తోంది. పూరీని జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల టీమ్ ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈడీ పూరీని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు విషయంలో ప్రశ్నించనున్నారని సమాచారం. ఇక ఇప్పటికే ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పూరీ జగన్నాథ్‌తో పాటు నటుడు రానా దగ్గుబాటి, నటి రకుల్‌ప్రీత్ సింగ్, నిర్మాత చార్మి, నటుడు రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులు ఉన్నారు. వీరితో పాటు ఈ విచారణకు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ కూడా రానున్నారు.
ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖుల విచారణ తేదీలు ఇలా ఉన్నాయి. పూరి జగన్నాథ్ - ఆగస్టు 31, ఛార్మి - సెప్టెంబర్ 2, రకుల్‌ప్రీత్ సింగ్ - సెప్టెంబర్ 6, రానా దగ్గుబాటి - సెప్టెంబర్ 8, రవితేజ - సెప్టెంబర్ 9, శ్రీనివాస్ - సెప్టెంబర్ 9, నవదీప్ - సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ - సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ - సెప్టెంబర్ 15, తనీష్ - సెప్టెంబర్ 17, నందు - సెప్టెంబర్ 20, తరుణ్ - సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.