• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DRUGS CASE CCB OFFIALS SUMMONS TO ANCHOR ANUSHREE SU

Drugs Case: ప్రముఖ యాంకర్ అనుశ్రీకి నోటీసులు..

Drugs Case: ప్రముఖ యాంకర్ అనుశ్రీకి నోటీసులు..

అనుశ్రీ(Photo-Instagram/anchor_anushreeofficial)

శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు స‌ృష్టిస్తోంది. తాజగా డ్రగ్స్ కేసుకు సంబంధించి మంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రముఖ కన్నడ యాంకర్, నటి అనుశ్రీకి నోటీసులు జారీచేశారు.

  • Share this:
    శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు స‌ృష్టిస్తోంది. తాజగా డ్రగ్స్ కేసుకు సంబంధించి మంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రముఖ కన్నడ యాంకర్, నటి అనుశ్రీకి నోటీసులు జారీచేశారు. తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా ఆమెకు నోటీసులు పంపినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం బెంగళూరులో ఉన్న అనుశ్రీ.. తనకు సీసీబీ నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని తెలిపింది. ఇక, సెప్టెంబర్ 19న డ్రగ్స్ రవాణాకు సంబంధించి బాలీవుడ్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కిషోర్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడు విచారణలో వెల్లడించిన సమాచారం ఆధారంగా పోలీసులు అనుశ్రీకి నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. గతంలో పలు పార్టీలో అనుశ్రీ డ్రగ్స్ తీసుకుందని.. కిషోర్ చెప్పినట్టుగా సమాచారం.

    మంగళూరుకు చెందిన అనుశ్రీ బెంగళూరులో స్థిరపడ్డారు. టీవీ యాంకర్‌గా రాణించడంతో పాటు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. ఎక్కువగా మేల్ యాంకర్‌లు ఉన్న కన్నడ పరిశ్రమలో ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్నారు. తనదైన స్క్రీన్ అపియరెన్స్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కన్నడనాట అత్యధిక పరితోషికం అందుకుంటున్న యాంకర్లలో అనుశ్రీ కూడా ఒకరు.

    ఇక, నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. వారికి సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే డ్రగ్స్ కేసుకు సంబంధించి.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నటి ఐంద్రితా రై, ఆమె భర్త, నటుడు దిగంత్‌లకు అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో వారు విచారణకు హాజరు అయ్యారు. డ్రగ్స్ కేసు ప్రకంపనల నేపథ్యంలో పలువురు ప్రముఖులు.. ఇందులో నుంచి బయటపడేందుకు న్యాయ నిపుణలను ఆశ్రయిస్తున్నట్టుగా సమాచారం.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు