హోమ్ /వార్తలు /సినిమా /

Rakul Preet Singh | Tollywood Drug Case : ఈడీ ముందుకు రకుల్.. కొనసాగుతోన్న విచారణ..

Rakul Preet Singh | Tollywood Drug Case : ఈడీ ముందుకు రకుల్.. కొనసాగుతోన్న విచారణ..

రకుల్ ప్రీత్ సింగ్ Photo : Instagram

రకుల్ ప్రీత్ సింగ్ Photo : Instagram

Rakul Preet Singh | Tollywood Drug Case : టాలీవుడ్ డ్రగ్ కేసులో ఈరోజు రకుల్ ప్రీత్ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

  టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు (Tollywood Drug Case) విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రముఖ నటి, నిర్మాత (Charmi) ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక ఈరోజు మరో పాపులర్ నటి రకుల్ ప్రీత్‌ను ప్రశ్నిస్తున్నారు. రకుల్ (Rakul Preet Singh) సెప్టెంబర్ 6న విచారణకు రావాల్సి ఉండగా.. ఆమె రిక్వెస్ట్ మేరకు అధికారులు ఈరోజు విచారణ చేయనున్నారు. ఈడీ విచారణ నిమిత్తం రకుల్ ఈ ఉదయం ఈడీ కార్యాలయానికి హాజరైంది.

  ఉదయం 10:30 కి ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు నోటీసులో పేర్కొనగా.. 9:10కే రకుల్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది. రకుల్‌తో పాటు చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదితో కలిసి ఈడీ ఆఫీసుకు చేరుకుంది.

  ఈ డ్రగ్‌ కేసులో డ్రగ్ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో రకుల్‌ని ప్రశ్నించనున్నారు అధికారులు. అంతేకాదు ఆమె బ్యాంకు అకౌంట్లను పరిశీలించనుందని తెలుస్తోంది. ఇక ఇదే డ్రగ్ కేసులో ఈనెల 8న నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకి రానున్నారు.

  మంగ‌ళ‌వారం (Puri Jagannadh ) పూరీ జ‌గ‌న్నాథ్‌ని 10 గంట‌ల పాటు ప‌లు కోణాల‌లో పూరీని విచారించిన‌ట్టు తెలుస్తుంది. ఇక గురువారం నటి ఛార్మీని 8 గంట‌ల పాటు ప్ర‌శ్నించారు. అంతేకాదు మ‌రో సారి తాను విచార‌ణ‌కు హాజ‌రు అవుతాన‌ని ఛార్మి తెలిపిందని సమాచారం.

  ఈ 12 మంది జాబితాలో పూరీ జగన్నాథ్‌తో పాటు నటుడు రానా దగ్గుబాటి, నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నిర్మాత చార్మి, నటుడు రవితేజ, నవ్‌దీప్‌, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌, తరుణ్‌, నందులు ఉన్నారు.

  వీరితో పాటు ఈ విచారణకు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌, ఎఫ్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా రానున్నారు. ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖుల విచారణ తేదీలు ఇలా ఉన్నాయి.

  పూరి జగన్నాథ్‌ - ఆగస్టు 31, ఛార్మి - సెప్టెంబర్‌ 2, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ - సెప్టెంబర్‌ 6, రానా దగ్గుబాటి - సెప్టెంబర్‌ 8, రవితేజ - సెప్టెంబర్‌ 9, శ్రీనివాస్‌ - సెప్టెంబర్‌ 9, నవదీప్‌ - సెప్టెంబర్‌ 13, ఎఫ్‌ క్లబ్‌ జనరల్ మేనేజర్ - సెప్టెంబర్‌ 13, ముమైత్‌ ఖాన్‌ - సెప్టెంబర్‌ 15, తనీష్‌ - సెప్టెంబర్‌ 17, నందు - సెప్టెంబర్‌ 20, తరుణ్‌ - సెప్టెంబర్‌ 22న విచారణకు హాజరు కానున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rakul Preet Singh, Tollywood drugs case, Tollywood news

  ఉత్తమ కథలు