DRISHYAM HEROINE MEENA AGAIN PAIR WITH MOHAN BABU SON OF INDIA MOVIE TA
Mohan Babu: ‘సన్నాఫ్ ఆఫ్ ఇండియా’లో మోహన్ బాబు సరసన జబర్ధస్త్ జడ్జ్..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు
Mohan Babu: నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత కొన్నేళ్లుగా తాను చేసే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు సరసన మరోసారి సీనియర్ కథానాయికగా నటించబోతుంది.
Mohan Babu: నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత కొన్నేళ్లుగా తాను చేసే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘గాయత్రి’ మూవీ తర్వాత మోహన్ బాబు మరోసారి హీరోగా నటించలేదు. ఆ తర్వాత ‘మహానటి’ లో ఎస్వీఆర్ పాత్రలో నటించారు. గతేడాది సూర్య హీరోగా నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో ఎయిర్‌ఫోర్స్ అధికారి భక్తవత్సలం నాయుడు పాత్రలో మెప్పించారు. ఆ సంగతి పక్కనపెడితే.. మోహన్ బాబు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మోహన్ బాబు సరసన మరోసారి జబర్ధస్త్ జడ్జ్ హీరోయిన్గా నటిస్తోంది. జబర్ధస్త్ జడ్జ్.. అంటే.. .రోజా కొన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా ఉంటే.. మీనా అప్పట్లో జబర్ధస్త్ జడ్జ్‌గా నటించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడీ ఈ భామ మోహన్ బాబు సన్నాఫ్ ఇండియాలో మీనా కథానాయికగా నటిస్తోంది.
గతంలో వీళ్లిద్దరు ‘అల్లరి మొగుడు’, పుణ్యభూమి నా దేశం’ సినిమాలతో పాటు ‘మామ మంచు అల్లుడు కంచు’ వంటి సినిమాల్లో జోడిగా నటించారు. ఇపుడు మరోసారి ‘సన్నాఫ్ ఇండియా’లో మోహన్ బాబు, మీనా జంట ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు.
మరోసారి మోహన్ బాబు సరసన మీనా (File/Photo)
ప్రస్తుతం మీనా.. మోహన్ లాల్ ‘దృశ్యం 2’ సినిమాలో నటించింది.మరోసారి వెంకటేష్.. సరసన దృశ్యం 2’లో నటించనుంది. మరోవైపు రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.
దృశ్యం 2 లో మోహన్ బాబు, మీనా (Drishyam 2 trailer)
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు భార్య వెరోనిక .. మోహన్ బాబు స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ సినిమాను సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
సన్నాఫ్ ఇండియాగా మోహన్ బాబు (Twitter/MohanBabu)
దాదాపు 500 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో మెప్పించిన మోహన్ బాబు.. ఇపుడు సన్నాఫ్ ఇండియా అంటూ దేశ భక్తి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఈ సినిమా టైటిల్‌ను బట్టి చెప్పొచ్చు. చాలా యేళ్ల తర్వాత మోహన్ బాబు సోలో హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంతో మోహన్ బాబు మరోసారి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ కింగ్ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.