హోమ్ /వార్తలు /సినిమా /

Meena- Drishyam 2: మీనాపై ట్రోల్స్.. నేను చెప్పినా వినలేదంటూ నటిపై దృశ్యం దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

Meena- Drishyam 2: మీనాపై ట్రోల్స్.. నేను చెప్పినా వినలేదంటూ నటిపై దృశ్యం దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

Jeethu Joseph- Meena: మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన దృశ్యం 2 ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో సినిమాలు సంద‌డి చేస్తున్న‌ప్ప‌టికీ.. ఈ మూవీని ఓటీటీలో విడుద‌ల చేశారు ద‌ర్శ‌క‌నిర్మాతలు

ఇంకా చదవండి ...

  Jeethu Joseph- Meena: మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన దృశ్యం 2 ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో సినిమాలు సంద‌డి చేస్తున్న‌ప్ప‌టికీ.. ఈ మూవీని ఓటీటీలో విడుద‌ల చేశారు ద‌ర్శ‌క‌నిర్మాతలు. ఈ నెల 19న ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వినిపిస్తున్నాయి. ఒక చిన్న పాయింట్‌తో ఈ మూవీని ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సాధార‌ణ ప్రేక్ష‌కులే కాదు సినీ, క్రీడా ప్ర‌ముఖులు కూడా దృశ్యంపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇందులో మీనా లుక్‌పై ట్రోల్స్ వ‌చ్చాయి. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా నటించిన మీనా.. కొన్ని స‌న్నివేశాల్లో మేక‌ప్‌తో ఉంటుంది. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లోనూ మీనా లిప్‌స్టిక్‌తో కనిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఆమెపై ట్రోల్స్ వ‌చ్చాయి.

  తాజాగా వాటిపై ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ స్పందించారు. ఈ ట్రోల్స్‌తో నేను అంగీక‌రిస్తాన‌ని ఆయ‌న అన్నారు. ఈ పాత్ర‌కు నో మేక‌ప్ లుక్ కావాల‌ని తాను మీనాను అడిగాన‌ని.. అయితే డీ గ్లామ‌ర్ లుక్‌లో న‌టించేందుకు ఆమె అంగీక‌రించ‌లేద‌ని తెలిపారు. డీ గ్లామ‌ర్‌గా క‌నిపించేందుకు త‌న‌కు ఇష్టం లేద‌ని మీనా చెప్పింద‌ని అన్నారు.

  దృశ్యం మొద‌టి భాగంలోనూ మీనా లుక్స్‌పై ట్రోల్స్ రాగా.. ఆ విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ మీనా ఒప్పుకోలేద‌ని అన్నారు. అయితే లుక్ కంటే వారి ప‌ర్ఫామెన్స్‌కి ప్రాధాన్య‌త‌ను ఇచ్చే తాను చివ‌ర‌కు ఒప్పుకున్న‌ట్లు తెలిపారు. మీనా మిన‌హాయించి మిగిలిన అంద‌రూ ఇందులో మేక‌ప్ లేకుండా నటించేందుకు ఓకే చెప్పార‌ని అన్నారు. ఏదేమైనా ఈ మూవీకి వ‌స్తోన్న రెస్పాన్స్ త‌న‌కు సంతోషాన్ని ఇచ్చింద‌ని తెలిపారు.

  కాగా ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు తెలుగులో దృశ్యం 2ను రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వెంక‌టేష్ హీరోగా న‌టించనున్న దృశ్యం 2 మార్చి నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. తెలుగు వారి అభిరుచికి అనుగుణంగా ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

  First published:

  Tags: Meena

  ఉత్తమ కథలు