Home /News /movies /

DRISHYAM 3 STORY LINE DETAILS GO VIRAL ON SOCIAL MEDIA SB

Drishyam 3: దృశ్యం 3 స్టోరీ లైన్ ఇదే...మూడో పార్ట్‌తో కథ క్లోజ్.. !

దృశ్యం 3

దృశ్యం 3

దృశ్యం.. తమిళ్ తెలుగు, మలయాళం, హింీ భాషల్లో కూడా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రెండు పార్టులు కూడా హిట్ కొట్టాయి. అయితే తాజాగా ఇప్పుడు మూడో పార్ట్ కూడా రానుంది. దృశ్యం పార్ట్ 3కు సంబంధించి స్టోరీ లైన్ ఒకటి వైరల్ అవుతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఈ మధ్య జనం మళ్లీ సినిమాల వైపు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లకు సినిమాలు చూసేందుకు వస్తున్నారు. ఇక సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు సైతం మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగింది. అంతేకాదు ఓటీటీలోకూడా విడుదల చేసిన ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే మనం మళయాల సినిమాల్ని రిమేక్ చేసిన ఇక్కడ జనం చూస్తున్నారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలు ఎంతటి ఘన విజయాలను అందుకున్నాయో మనకు తెలిసిందే. తెలుగుతో పాటు రీమేక్ అయిన ఇతర భాషల్లోను ఈ సినిమాలకి విశేషమైన ఆదరణ లభించింది. ఫస్టు పార్టుకి మించి సెకండు పార్టుకి రెస్పాన్స్ రావడం విశేషం. దీంతో ఇప్పుడు మూడో పార్ట్ కూడా రానున్నట్లు సమాచారం.

    మొదటి కథలో చివరిలో ఏదైనా ట్విస్ట్ ఉంటే అది అక్కడికే ముగింపు పలక పోగా దానిని సీక్వెల్స్ కథలో సాగదీస్తూ అక్కడ ముగింపు ఇస్తారు.సెకండ్ సీక్వెల్స్ లో కూడా ముగింపు ఇవ్వకపోతే థర్డ్ సీక్వెల్స్ లో అయినా ఆ ట్విస్ట్ ను బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. అలా ట్విస్ట్ కోసం ప్రేక్షకులు ఖచ్చితంగా సీక్వెల్స్ సినిమా చూడటానికి ఇష్టపడతారు. ఇలాంటి లైన్‌లో చాలా సినిమాలు తెరకెక్కాయి.
    అందులో బాహుబలి, ఎఫ్2, పుష్ప, దృశ్యం, కార్తికేయ వంటి పలు సినిమాలు ఉండగా పుష్ప 2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలలో కొన్ని కథలు మొదటి కథతో సాగగా మరికొన్ని రెండవ కథలో కాస్త మార్చి చూపించారు.

    తెలుగులో ఈ సినిమాలో వెంకటేష్, మీనా, నదియా, నరేష్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. సినిమా మొదటి భాగంలో నదియా కొడుకును వెంకటేష్ చంపి పోలీస్ స్టేషన్ కింద పాతిపెడతాడు. దృశ్యం వన్‌లో వెంకటేష్ నిజం చెప్పకుండా ఉంటాడు.ఇక రెండవ కథలో వెంకటేష్ నుండి నిజం బయటికి రావడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా రెండవ కథలో కూడా వెంకటేష్ బయటపడడు.ఇక మూడవ కథ ఉంటుంది అని గతంలో తెలియగా తాజాగా ఈ కథకు సంబంధించిన ఒక లైన్ బయటపడింది.
    మూడవ కథలో కూడా వెంకటేష్ నుంచి నిజం బయటికి రప్పించే ప్రయత్నం చేస్తారు అని కానీ ఇందులో కూడా వెంకటేష్ నిజం చెప్పడు అని దీంతో పూర్తిగా కేసు కొట్టివేస్తారు అని తెలిసింది. కారణం ఏంటంటే ఇందులో వెంకటేష్ బీజేపీ పార్టీలో చేరి రాజకీయ నాయకుడిగా మారడంతో ఆయనకు రాజకీయ సపోర్ట్ ఉండటం వల్ల ఆయన మీద ఉన్న కేసు కొట్టివేస్తారు అని తెలిసింది.

    ఇదంతా పక్కన పెడితే త్వరలో దృశ్యం 3 కూడా రానుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమా 3వ భాగాన్ని సిద్ధం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మోహన్ లాల్ పోస్టర్ ను వదిలారు. మోహన్ లాల్ కి సంకెళ్లు వేసి ఉండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సిరీస్ ఈ సినిమాతో ముగుస్తుందని జీతూ చెప్పడంతో, ముగింపు పట్ల అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది. జీతూ చాలా వేగంగా కథాకథనాలు రెడీ చేస్తుండటం,అంతేకాకుండా చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ రోజుల్లో తెరపైకి తీసుకుని వస్తుండటం విశేషం. మలయాళంలో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూసుకుని, తెలుగు రీమేక్ గురించిన ఆలోచన చేయవచ్చనే ఉద్దేశంతో వెంకటేశ్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Daggubati venkatesh, Drishyam 2, Hero venkatesh

    తదుపరి వార్తలు