• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DRISHYAM 2 SHOOTING FINISHED VENKATESH JEETHU JOSEPH DRISHYAM 2 SHOOTING COMPLETED IN 47 DAYS SR

Drishyam 2 : 50 రోజులు అనుకుంటే 47 రోజులకే పూర్తి చేశారట.. దృశ్యం 2 షూటింగ్ ఫసక్..

Drishyam 2 : 50 రోజులు అనుకుంటే 47 రోజులకే పూర్తి చేశారట.. దృశ్యం 2 షూటింగ్ ఫసక్..

దృశ్యం 2 టీమ్ Photo : Twitter

Drishyam 2 | Venkatesh : తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ మలయాళీ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైనా దృశ్యం 2 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

  • Share this:
    తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ మలయాళీ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైనా దృశ్యం 2 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మలయాళం దృశ్యం 2లో మోహన్ లాల్ హీరోగా చేసాడు. ఇక మొదటి సినిమా దృశ్యంను ఆయన ఇదివరకే తెలుగులో అదే పేరుతో వెంకటేష్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దృశ్యం 2ను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుకుంది. కేవలం 47 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేశారు. అనుకున్నదానికంటే ముందే.. అంటే 50 రోజులు ప్లాన్ చేస్తే 47 రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైందని తెలుస్తోంది. ఈ కరోనా సమయంలో ఇంత త్వరగా షూటింగ్ పూర్తి చేయడం అంటే విశేషమే అంటున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోందట. అంతేకాదు కొన్ని రోజుల్లో రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమ్ చేయనున్నారని సమాచారం. ఈ విషయంపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.  వెంకటేష్, మీనా జంటగా నటించారు. నదియా కీలకపాత్రలో కనిపించనుంది.

    మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ తెలుగు వెర్షన్‌కి దర్శకత్వం వహించాడు. సురేష్ బాబు నిర్మించాడు. ఇక ఈ సినిమాతో పాటు వెంకటేష్ మరో సినిమాను కూడా రీమేక్ చేస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్టైనా అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు. తెలుగు ఈ సినిమా నారప్పగా వస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి కీలకపాత్రలో కనిపించనుంది. నారప్ప మే 14న విడుద‌ల కాబోతుంది.

    Victory Vekantesh Remakes Narappa To Drishyam 2 Venkatesh Remakes Many Movies In Telugu Here Are The List,Vekantesh Remakes: నారప్ప, దృశ్యం 2 సహా విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..,Venkatesh Remakes,Venaktesh Remake Mohanlal Drishyam 2,Drishyam 2 Telugu Remake,Venkatesh,Venkatesh,Venkatesh Movies,venkatesh remake movies,venkatesh remake,Venkatesh,Venkatesh asuran,asuran movie collections,asuran movie review,dhanush asuran movie,dhanush asuran movie review,asuran telugu remake,asuran remake,venkatesh asuran movie,telugu cinema,వెంకటేష్,వెంకటేష్ అసురన్,అసురన్ రీమేక్,అసురన్ తెలుగు రీమేక్,తెలుగు సినిమా,వెంకటేష్ రీమేక్ కహాని,వెంకటేష్ మూవీస్,వెంకటేష్ రీమేక్ మూవీస్,నారప్ప,నారప్ప అసురన్ రీమేక్,దృశ్యం 2 రీమేక్,మోహన్ లాల్ దృశ్యం 2 తెలుగు రీమేక్‌లో వెంకటేష్,దృశ్యం 2లో వెంకటేష్
    దృశ్యం 2,నారప్ప  (Twitter/Photo)


    ఈ రెండు సినిమాలతో పాటు ప్ర‌స్తుతం వెంకటేష్ ఎఫ్3 షూటింగ్‌‌లో పాల్గోంటున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 సీక్వెల్‌గా వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వరుణ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. తమన్నా, మెహ్రీన్, అంజలి ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎఫ్ 3 ఆగస్టు 27న రిలీజ్ కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు