Anchor Pradeep: ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా మారిందో అందరికీ తెలిసిందే. దేశం మొత్తం వైరస్ విజృంభణతో ప్రాణాలు అరచేతిలో నిలుపుకొని పలు జాగ్రత్తలతో ఉంటున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న క్రమంలో తీవ్ర భయాందోళనలు ఎదురవుతున్నాయి. ఇక సినీ పరిశ్రమలో కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో షూటింగ్ సమయంలో బిజీగా ఉండగా చాలామంది నటులకు, సినీ బృందాలకు వైరస్ సోకింది. వైరస్ వల్ల సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. అంతేకాకుండా సినిమా విడుదలను కూడా వాయిదా వేయగా.. త్వరలోనే బుల్లితెర సీరియల్స్ కూడా నిలిపివేస్తారని వార్తలు కూడా వినిపించాయి.
ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెరలో కూడా పలువురు వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే జబర్దస్త్ బ్యూటీ వర్ష కూడా వైరస్ సోకగా.. చికిత్స పొందుతుంది. ఇదిలా ఉంటే మరో బుల్లితెర యాంకర్ ప్రదీప్ కూడా వైరస్ బారిన పడ్డాడు. దీంతో బుల్లితెర కూడా తెగ వణుకుతుంది. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉండగా.. వైద్యుల సూచన మేరకు వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి ఇప్పటి వరకు ప్రదీప్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే ప్రదీప్ వైరస్ సోకక ముందు ఈటీవీ ఢీ, జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో లలో యాంకర్ గా బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం వైరస్ సోకిన నేపథ్యంలో తన యాంకరింగ్ స్థానంలో మరో బుల్లితెర యాంకర్ రవి యాంకరింగ్ చేస్తున్నట్లు తాజాగా విడుదలైన ఈ ప్రోగ్రాం ఎపిసోడ్ ప్రోమో లో కనిపించగా.. ప్రదీప్ కు వైరస్ సోకినందుకే అతని స్థానంలో రవిని పెట్టారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor pradeep, Corona virus, Covid positive, Covid-19, COVID-19 cases, Pradeep Machiraju, Pradeep machiraju anchor