Home /News /movies /

DR RAJASHEKHAR SHAKAR MOVIE THEATRICAL TRAILER RELEASE ON MAY 5TH TA

Dr RajaShekar - Shekar : యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు..

డాక్టర్ రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

డాక్టర్ రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

Dr. Rajasekhar as Shekhar : కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. ఇక ఈయన హీరోగా నటించిన మూవీ ‘శేఖర్’. మలయాళ రీమక్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.

ఇంకా చదవండి ...
    Dr. Rajasekhar as Shekhar : కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. ఇక హీరోగా వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ (PSV Garudavega) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు ఈ యాంగ్రీమ్యాన్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. అంతేకాదు ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత కోలుకున్నారు. ఆ తర్వాత ‘శేఖర్’ అనే కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను లలిత్ అనే కొత్త దర్శకుడుతో ప్రారంభమైన జీవితా రాజశేఖర్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాను వేరే నిర్మాతలతో కలిసి రాజశేఖర్ కూతుళ్లైన శివానీ, శివాత్మిక నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద తనయ శివానీ రాజశేఖర్ .. ఆయన కూతురు పాత్రలో నటించడం విశేషం.

    హీరోగా రాజశేఖర్‌కు 91వ సినిమా. ‘శేఖర్’ (Shekar) మూవీ మలయాళంలో హిట్టైన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు.  ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ముస్కాన్ కూబ్‌చాందిని హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమాను థియేట్రికల్ ట్రైలర్‌ను మే 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను మే 20న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    Acharya 4 Days WW Collections : చిరంజీవి, రామ్ చరణ్‌ల ’ఆచార్య’ 4 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. దారుణాతి దారుణం..


    ఈ  సినిమాలో రాజశేఖర్ పోలీస్  ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలో రాజశేఖర్  సిగరెట్ వెలిగించి బుల్లెట్ బండిపై వచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. ఈ సినిమాతో  ఈయన  మరో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ముస్కాన్, అను సితార కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్‌కు హిట్ అనేది కంపల్సరీ. ఈ సినిమా కోసం రాజశేఖర్ 60 యేళ్ల వయసులో కొన్ని రిస్కీ షాట్స్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఔట్ పుట్ పై రాజశేఖర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడట. నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది.

    May Most Awaited Movies : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, F3 సహా మే నెలలో విడుదల కానున్న మోస్ట్ అవేటేడ్ మూవీస్..


    కానీ, ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో రాజశేఖర్ ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నారు. మరోవైపు రాజశేఖర్  కిరణ్ అనే డైరెక్టర్ దర్శకత్వంలో 92వ సినిమా చేస్తున్నారు. ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ అనే విషయం అర్ధమవుతుంది.



    రాజశేఖర్.. వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘మర్మాణువు’ అనే టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో ఒక పుర్రెకు తలపాగా చుట్టారు. ఈ  లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు. ఈ సినిమాను కూడా రాజశేఖర్ వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dr Rajashekar, Shekar Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు