Shekar Movie : రాజశేఖర్ హీరోగా జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) దర్శకత్వంలో వచ్చిన శేఖర్ సినిమా ( Shekar Movie ) ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. డబ్బులు చెల్లించలేదంటూ ఈ సినిమా ఫైనాన్షియర్ పరంధామ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో హైదరాబాద్ సీటీ సివిల్ కోర్టు శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని హైదరాబాద్ సీటీ సివిల్ కోర్టు ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఐతే.. కోర్టు ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయమంటూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని వెల్లడించారు. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన పిటిషన్‌ను సోమవారం నాడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో పాటు శేఖర్ సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
కొంతమంది ఉద్దేశపూర్వకంగా శేఖర్ సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లు జీవిత రాజశేఖర్, నిర్మాత తరపు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం వెల్లడించనున్నారు. మే 20న ‘శేఖర్’ సినిమా విడుదల కాగా ఫైనాన్షియర్ పరంధామరెడ్డి పిటిషన్ మేరకు తొలుత ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు హీరో రాజశేఖర్ కూడా ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టగా అది వైరల్ అయ్యింది. మరోవైపు ఈ సినిమా ప్రదర్శనలు కూడా నిలిచిపోయాయి.
Jr NTR : అపుడు త్రివిక్రమ్.. ఇపుడు కొరటాల శివ.. ఆయుధం ఎన్టీఆర్..
ఈ క్రమంలో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా గురించి సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. శేఖర్ సినిమా ఆగిపోవడంతో తమకు ఎంతో నష్టం జరుగుతుందనీ, ఈసినిమా నెగటివ్ మీద ఉన్న స్టే ని రద్దు చేయాలని జీవిత రాజశేఖర్ అడ్వకేట్స్ కోర్టును కోరారు. ఈ సమయంలో పరంధామ రెడ్డి తరపున అడ్వకేట్స్ సినిమా ప్రదర్శించుకొనుటకు మాకెటువంటి అభ్యంతరం లేదని, అయితే వచ్చే కలక్షన్లలో మా క్లైంట్ల కు ఇవ్వాలసిన 87లక్షల10వేల రూపాయలని కోర్టులో డిపాజిట్ చేయించాలని జడ్జిని కోరారు. ఈ వాదనతో జడ్జి ఏకీభవించారు. అందుకు జీవితా రాజశేఖర్ న్యాయవాదులు ఒప్పుకుంటూ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చే డబ్బుని డిపాజిట్ చేస్తామని తెలియజేయడంతో ,రెండు రోజులలో ఆ అకౌంట్ వివరాలను కోర్టుకు తెలియచేయాలని జడ్జి ఆదేశించారు. దీంతో సినిమా ప్రదర్శనకు అనుమతి లభించినట్టు అయ్యింది.
తాజాగా శేఖర్ సినిమా విషయమై.. రాజశేఖర్ దంపతుల లాయర్ అడ్వకేట్ రమేష్ సింగ్ మాట్లాడుతూ.. అడ్వకేట్ రమేష్ సింగ్ మాట్లాడుతూ.. శేఖర్ మూవీ విడుదల సందర్భంగా జీవితా రాజశేఖర్ దంపతులపై ఫైనాన్షియర్ పరంధామ రెడ్డి కేసు ఫైల్ చేసిన విషయం టోటల్ ఫాల్స్ అన్నారు. ఈ సినిమాను పాజిటివ్ టాక్ రావడంతో కావాలనే రాజశేఖర్ అంటే గిట్టని వాళ్లతో కలిసి ఈ సినిమా ప్రదర్శనను కావాలనే అడ్డుకున్నట్టు ఆయన ఓ వీడియోలో తెలిపారు. త్వరలోనే మా క్లైంట్స్ రాజశేఖర్ దంపతులు సలహా మేరకు వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dr Rajashekar, Jeevitha rajashekar, Shekar Movie, Tollywood