Rajashekar - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా రాజశేఖర్ కుటుంబానికి, చిరంజీవి ఫ్యామిలీకి అంతగా పడటం లేదన్న సంగతి తెలిసిందే కదా. వివరాల్లోకి ఇక చిరంజీవి, రాజశేఖర్ వివాదానికి వస్తే.. అప్పట్లో చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు మీరు చిరుకు సపోర్ట్ చేస్తారా అని ఓ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిపుడు.. రాజశేఖర్ దంపతులు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేసాయి. అప్పట్లో ప్రజారాజ్యం పెట్టిన సమయంలో ఆయనకు అనుభవం లేదు.. చిరు రాజకీయాల్లో ఉన్నా సక్సెస్ కాలేడని చెప్పి మెగాభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. దీనిపై కొంత మంది మెగాభిమానులు హైదరాబాద్‌లో రాజశేఖర్ కుటుంబ సభ్యులపై దాడి చేసారు. ఆ తర్వాత చిరు.. తన అభిమానులు రాజశేఖర్ పై చేసిన దాడిని ఖండిస్తూ.. ఆయన ఇంటికి వెళ్లి సర్ధిచెప్పడం అంతా జరిగింది.
చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత సత్యమేయజయతే అంటూ సినిమా చేసి అందులోనూ చిరంజీవికి వ్యతిరేకంగా డైలాగులు పెట్టాడు. అంతకు ముందు రమణ సినిమా రీమేక్ ఠాగూర్ విషయంలో వీళ్లిద్దరి మధ్య తొలిసారి వివాదం మొదలైంది.అప్పట్లో ఠాగూర్ సినిమా విషయంలో వీళ్లిద్దరు మధ్య ఆ గ్యాప్ మరింత పెరిగింది. ఆ తర్వాత అడపదడపా వీళ్లిద్దరు కలుస్తూనే ఉన్నారు. తాజాగా రాజశేఖర్ ఓ మీడియాకు శేఖర్ మూవీ విడుదల సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ యాంకర్.. రాజశేఖర్.. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. కొంత మంది దీనిపై పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొంతరు నెగిటివ్‌గా స్పందించారు.
దానిపై వివరణ కోరగా.. పవన్ కళ్యాణ్‌కు తనపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ తనపై సెటైరికల్‌గా చేసిన ఈ డైలాగులు నన్ను బాధించయన్నారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ విషయంలో చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు. పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు అని కొన్ని విషయాలు చెప్పినందుకే పవన్ కళ్యాణ్ తనపై కోపంగా ఉన్నారు. అలా తనపై కోపాన్ని నన్ను ఇమిటేట్ చేస్తూ ‘గబ్బర్ సింగ్’ సినిమాగా తనపై పేరడీగా చేసి తీర్చుకున్నట్టు చెప్పారు.
ఇక రాజశేఖర్ నటించిన శేఖర్’ విషయానికొస్తే.. ఈ నెల 20న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్‌తో ఈ సినిమాను ఆగిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒక కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇందులో రాజశేఖర్ లుక్‌తో పాటు నటన బాగుంది. ఆమె కూతురుగా శివానీ యాక్ట్ చేయడం విశేషం. మరోసారి యాంగ్రీ మ్యాన్‌గా రాజశేఖర్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dr Rajashekar, Pawan kalyan, Shekar Movie, Tollywood