తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీసీసీకి రాజశేఖర్ కూతుళ్లు విరాళం..

ప్రస్తుతం మన దేశంతో పాటు అన్ని దేశాలు కరోనా అనే మహామ్మారి భారీన పడ్డాయి. ఈ వైరస్ కట్డడి కోసం కేంద్రం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించింది. ఇప్పుడు రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక రాజశేఖర్ కూడా తమ వంతుగా చెరో లక్ష రూపాయలు మొత్తంగా రూ. 2 లక్షలను విరాళంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందజేసారు.

news18-telugu
Updated: April 22, 2020, 2:56 PM IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీసీసీకి రాజశేఖర్ కూతుళ్లు విరాళం..
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు రూ. 2 లక్షల విరాళం అందజేసిన రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం మన దేశంతో పాటు అన్ని దేశాలు కరోనా అనే మహామ్మారి భారీన పడ్డాయి. ఈ వైరస్ కట్డడి కోసం కేంద్రం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించింది. ఈ లాక్‌డౌన్ కారణంగా ఇండస్ట్రీలో పనులన్నీ ఆగిపోయాయి. దాంతో రోజు వారి కూలీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాంతో పాటే సినీ కార్మికులకు కూడా పొట్టకూటి కోసం తిప్పలు తప్పడం లేదు. దాంతో వాళ్లకు మేమున్నాం అంటూ ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు సినిమా నటులు. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఇప్పటికే ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి చాలా మంది విరాళాలు అందిస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్లు ఇస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక రాజశేఖర్ కూడా తమ వంతుగా చెరో లక్ష రూపాయలు మొత్తంగా రూ. 2 లక్షలను విరాళంగా ఇచ్చారు.

సీసీసీకి చెందిన రూ. 2 లక్షల చెక్‌ను సి.కళ్యాణ్‌కు అందజేసిన రాజశేఖర్ కూతుళ్లు (Twitter/Photo)


దాంతో పాటు రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు  లక్ష చెప్పున మొత్తంగా రూ. 2 లక్షల విరాళం అందజేయడం విశేషం. మొత్తంగా వేరే హీరోయిన్లు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విరాళం ఇవ్వడానికి సంకోచిస్తున్నఈ సమయంలో రాజశేఖర్ కూతుళ్లు ముందుకు వచ్చిన విరాళం ఇవ్వడం మంచి పరిణామం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో పనిలేక అల్లాడిపోతున్న సినిమా కార్మికులకు ముందుగా మేమున్నాం అని భరోసా ఇచ్చింది రాజశేఖర్ దంపతులే. ఈయన పేరు మీద ఉన్న ట్రస్టు నుంచి పేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందించాడు ఈ సీనియర్ హీరో. ఆ తర్వాత శివాజీ రాజా కూడా కూరగాయలు ఇచ్చాడు. అక్కడ్నుంచి అంతా కదిలొచ్చారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 22, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading