Dr. Rajasekhar as Shekhar : కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. ఇక హీరోగా వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ (PSV Garudavega) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు రాజశేఖర్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. అంతేకాదు ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత కోలుకున్నారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా ‘శేఖర్’ అనే కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా లుక్‌ను విడుదల చేసారు. ఈ సినిమాతో లలిత్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను వేరే నిర్మాతలతో కలిసి రాజశేఖర్ కూతుళ్లైన శివానీ, శివాత్మిక నిర్మిస్తున్నారు.
హీరోగా రాజశేఖర్‌కు 91వ సినిమా. ‘శేఖర్’ (Shekar) మూవీ మలయాళంలో హిట్టైన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ‘శేఖర్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను నవంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Catch the first #ShekarGlimpse of @ActorRajashekar in and as Shekar, the man of scars on Nov 25th ?#JeevithaRajashekar @Rshivani_1 @ShivathmikaR #MallikarjunNaragani @anuprubens @LakshmiBhupal @Ananthkancherla @PegasusCineC @ticketfactory pic.twitter.com/fEZiepaYzn
— BA Raju's Team (@baraju_SuperHit) November 22, 2021
ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ముస్కాన్, అను సితార కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్‌కు హిట్ అనేది కంపల్సరీ. ఈ సినిమా కోసం రాజశేఖర్ 59 యేళ్ల వయసులో కొన్ని రిస్కీ షాట్స్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఔట్ పుట్ పై రాజశేఖర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడట.
Kollywood Heroes In Tollywood : రజినీ,కమల్, సూర్య సహా తెలుగులో సత్తా చూపెట్టిన హీరోలు..
క ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర్ కి తప్పనిసరిగా హిట్ కావాలి, అందుకే ఈ సినిమా కోసం కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడట ఈ సీనియర్ హీరో. నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో రాజశేఖర్ ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నారు. మరోవైపు రాజశేఖర్ కిరణ్ అనే డైరెక్టర్ దర్శకత్వంలో 92వ సినిమా చేస్తున్నారు. ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ అనే విషయం అర్ధమవుతుంది.
Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..
రాజశేఖర్.. వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘మర్మాణువు’ అనే టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో ఒక పుర్రెకు తలపాగా చుట్టారు. ఈ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు. ఈ సినిమాను కూడా రాజశేఖర్ వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajasekhar, Shekar Movie, Tollywood