Rajasekhar: హీరో జీవిత రాజశేఖర్‌ దంపతులకు కరోనా.. కూతుళ్లు శివానీ, శివాత్మికకు కూడా..

Rajasekhar Corona Positive: కరోనా వైరస్ రోజురోజుకీ ఇంకా తీవ్రతరం అవుతుందే కానీ ఎంతకీ తగ్గట్లేదు. సామాన్యులతో పాటు ప్రముఖులను కూడా కరోనా వైరస్ వదలడం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పటికే ఎంతోమంది కోవిడ్ బారిన పడి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2020, 3:03 PM IST
Rajasekhar: హీరో జీవిత రాజశేఖర్‌ దంపతులకు కరోనా.. కూతుళ్లు శివానీ, శివాత్మికకు కూడా..
రాజశేఖర్ కుటుంబానికి కరోనా (rajasekhar corona)
  • Share this:
కరోనా వైరస్ రోజురోజుకీ ఇంకా తీవ్రతరం అవుతుందే కానీ ఎంతకీ తగ్గట్లేదు. సామాన్యులతో పాటు ప్రముఖులను కూడా కరోనా వైరస్ వదలడం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పటికే ఎంతోమంది కోవిడ్ బారిన పడి నరకం చూస్తున్నారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ కుటుంబం కూడా కరోనా బారిన పడింది. ప్రముఖ టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. రాజశేఖర్, జీవిత దంపతులతో పాటు వాళ్ల ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మికల రాజశేఖర్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ తన ట్వీట్టర్‌లో వెల్లడించాడు. తనతో పాటు భార్య జీవిత.. పిల్లలు శివానీ, శివాత్మికకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని చెప్పాడు రాజశేఖర్. ప్రస్తుతం తామంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని.. తమ కుమార్తెలు శివానీ, శివాత్మికలు కరోనా నుంచి కోలుకున్నారని ఆయన పేర్కొన్నాడు.

తాను, జీవిత మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నామని.. అక్కడే మెరుగైన చికిత్స తీసుకుంటున్నామని తెలిపాడు రాజశేఖర్. ప్రస్తుతం తమ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. కరోనా నుంచి కోలుకొని తాము త్వరలోనే ఇంటికి వస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా నుంచి రాజశేఖర్ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు రాజశేఖర్ కుటుంబానికి ఫోన్ చేసి ధైర్యం చెప్తున్నారు. స్వతహాగా రాజశేఖర్ కూడా వైద్యుడు కావడంతో ఆయన ధైర్యంగానే ఉన్నాడు. వీలైనంత త్వరగా తన కుటుంబం అంతా సురక్షితంగా కరోనా బారి నుంచి బయటికి వస్తామని తెలిపాడు.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading