• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DR KAKARLA SUBBARAO ABOUT HERO BALAKRISHNA GUN FIRE INCIDENT MK

బాలయ్య ఆ రాత్రి తుపాకీతో ఆత్మహత్య చేసుకునేవాడు...సంచలన విషయాలు చెప్పిన డాక్టర్ సాబ్..

బాలయ్య ఆ రాత్రి తుపాకీతో ఆత్మహత్య చేసుకునేవాడు...సంచలన విషయాలు చెప్పిన డాక్టర్ సాబ్..

బాలయ్యకు షాక్

కాకర్ల సుబ్బారావు ఇంటర్వ్యూ యూట్యూబ్ లో మరోసారి అప్ లోడ్ చేయగా చక్కటి రెస్పాన్స్ అందుకుంది. చాలా కాలం క్రితం బ్రాడ్ కాస్ట్ అయిన ఈ ఇంటర్వ్యూ కాకర్ల సుబ్బారావు ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది.

  • Share this:
    ప్రముఖ రేడియాలజిస్టు, నిమ్స్ ఆసుపత్రి స్థాపనలో కీలక పాత్ర పోషించిన వైద్యుడు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. మొత్తం 9 దశాబ్దాల చరిత్ర ఆయన సొంతం. ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్యను ఉన్నత ప్రమాణాలు నిలపడంలోనూ, ఎంతో మంది అగ్రగణ్యులైన డాక్టర్లను దేశానికి అందించడంలోనూ కాకర్లకు ఆయనకు ఆయనే సాటి అనే చెప్పాలి. వయోభారంతో, సుబ్బారావు అస్తమయం వైద్య ప్రపంచానికే తీరని లోటు అనే చెప్పాలి. ఈ సందర్భంగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో (ఏబీఎన్ చానెల్ లో ప్రసారమయ్యింది) కాకర్ల సుబ్బారావు ఇంటర్వ్యూ యూట్యూబ్ లో మరోసారి అప్ లోడ్ చేయగా చక్కటి రెస్పాన్స్ అందుకుంది. చాలా కాలం క్రితం బ్రాడ్ కాస్ట్ అయిన ఈ ఇంటర్వ్యూ కాకర్ల సుబ్బారావు ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకూ అంతగా వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ కాల్పుల ఘటనలో జరిగిన సంగతులను కాకర్ల ఏమాత్రం దాపరికం లేకుండా పంచుకున్నారు. ఆ రోజు ఆ సమయంలో బాలకృష్ణ కాల్పులు జరిపి ఉండకపోతే, ఆయన తనను తాను కాల్పుచుకొని ఆత్మహత్య చేసుకునేవాడని కాకర్ల సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.



    బాలకృష్ణ కాల్పుల ఘటనపై కాకర్ల సుబ్బారావు ఏమన్నారో విందాం...”నాకు మనస్సులో ఏవిధంగా కాపాడాలి అని ఉంది. ఒక విధం ఏమిటంటే సైకియాట్రి, అందువల్ల ఇద్దరు పెద్ద సైకియాట్రిస్టులను పిలిచి చూడమన్నాను. అతను అలా చేసి ఉండకపోతే తానే ఆత్మహత్య చేసుకునేవాడు అని, ఆ టైంలో అందువల్ల ఇట్లా చేయాల్సి వచ్చింది. దాంతో.... అలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు అలా చేస్తారు. ఆర్.కే: ఆ సమయంలో అవతలి వాళ్లకు ఏమైనా చేయాలి. లేకుంటే తనకుతానే ఏదైనా చేసుకోవాలి. ఆదృష్టితోనే అలా చేశారు. సానుభూతితో మీరు హెల్ప్ చేశారు..కాకర్ల:అవును మేజర్ హెల్ప్ చేశాను.

    ఇలా ఆద్యంతం ఆసక్తికరమైన అంశాలతో కాకర్ల సుబ్బారావు ఇంటర్వ్యూ సాగింది. కాకర్ల సుబ్బారావు అభిమానులకు, అలాగే ఆయన శ్రేయోభిలాషులు, శిష్యులకు ఈ ఇంటర్వ్యూ ద్వారా కాకర్ల జ్ఝాపకాలను తడిమేలా చేసింది.
    Published by:Krishna Adithya
    First published: