Dosti Music Video Of RRR : అదిరిన ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్.. మరోసారి మైమరిపించిన కీరవాణీ..

Dosti Music Video Of RRR Photo : Twitter

Dosti Music Video Of RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో టీమ్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో ఓ పాటను విడుదల చేసింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాట స్నేహం గొప్పదనం తెలుపుతోంది. హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.  ఇక ఈ పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్‌లతో పాటు కీరవాణీ, హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, యాజ్‌నీన్ నీజార్, విజయ్ ఏసుదాస్ కోరస్ పాడుతూ అదరగొట్టారు. ఏమాత్రం అంచనాలు తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ వీడియోను చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ చివరి షెడ్యూల్ కోసం చిత్రబృందం ఉక్రెయిన్ వెళ్తోంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటను చిత్రీకరించనున్నారు.

    ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: