హోమ్ /వార్తలు /సినిమా /

దొరబాబు ఎఫెక్ట్‌తో జబర్ధస్త్ రూల్స్ ఛేంజ్.. కొత్త కండిషన్స్ ఇవే..

దొరబాబు ఎఫెక్ట్‌తో జబర్ధస్త్ రూల్స్ ఛేంజ్.. కొత్త కండిషన్స్ ఇవే..

దొరబాబు ఎఫెక్ట్‌తో జబర్ధస్త్ కామెడీ షో‌లో మార్పులు (Twitter/Photo),

దొరబాబు ఎఫెక్ట్‌తో జబర్ధస్త్ కామెడీ షో‌లో మార్పులు (Twitter/Photo),

దొరబాబు ఎఫెక్ట్‌తో జబర్దస్త్ కామెడీ షోలో రూల్స్ మారబోతున్నాయా అంటే ఔననే అంటున్నాయి మల్లెమాల సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే..

దొరబాబు ఎఫెక్ట్‌తో జబర్దస్త్ కామెడీ షోలో రూల్స్ మారబోతున్నాయా అంటే ఔననే అంటున్నాయి మల్లెమాల సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే.. తాజాగా జబర్ధస్త్ కామెడీ షోలో కమెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దొరబాబు వ్యభిచారం చేస్తూ పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడటం స్మాల్ స్క్రీన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే దొరబాబు పోలీసులకు దొరికిన రోజు రాత్రి అసలేం జరిగింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. దొరబాబు, పరదేశీ కలిసి అక్కడ వ్యభిచార గృహం నడిపిస్తున్నారని కొందరు చెబుతున్నారు.. హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి ఈ ఎఫెక్ట్‌తో దొరబాబు పరువు గంగలో కలిసింది. ఏది ఏమైనా ఆడియన్స్ దృష్టిలో దొరబాబు పై బ్యాడ్ రిమార్క్ పడిపోయింది.దీంతో హైపర్ ఆది టీమ్‌లో కీ మెంబర్‌గా వ్యవహరించే దొరబాబు పట్టుపడటంతో ఆది కూడా తలలు పట్టుకుంటున్నాడు. తాజాగా జరిగిన సంఘటనతో మల్లెమాల టీమ్.. దొరబాబును బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టారు. దీంతో హైపర్ ఆది కలగజేసుకొని మల్లెమాల టీమ్‌తో మాట్లాడి మరలా దొరబాబు జబర్ధస్త్ టీమ్‌లో వచ్చేలా వాళ్లను కన్విన్స్ చేసినట్టు సమాచారం.

దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)
దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

తాజాగా దొరబాబు ఎఫెక్ట్‌తో మల్లెమాల టీమ్ మెంబర్స్ కొత్త కండిషన్స్ పెట్టినట్టు సమాచారం. ఇపుడు ప్రోగ్రామ్‌లో స్కిట్స్ చేస్తోన్న నటులు వేరే ఈవెంట్స్ కానీ.. సినిమాలు కానీ యాక్ట్ చేయడానికి వీల్లేదని చెబుతున్నారు. అంతేకాదు జబర్దస్త్ షో మెంబర్స్ ఎక్కడైనా బయట ఈవెంట్ వెళ్లాలన్న వాళ్ల పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నారు. వీటన్నింటికీ ఓకే చెబితేనే జబర్ధస్త్‌ షోలో పార్టిసిపేట్ చేయాలనే కండిషన్స్ పెట్టినట్టు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజంగా మల్లెమాల వాళ్లు ఇలాంటి కండిషన్స్ పెట్టారా.. ? అది సాధ్యమేనా అని అందరు చెప్పుకుంటున్నారు. మొత్తానికి దొరబాబు ఎఫెక్ట్‌తో జబర్థస్త్‌తో కొత్త రూల్స్ వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.

First published:

Tags: Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు