దొరబాబు సెక్స్ రాకెట్ ఇష్యూలో ఏం జరుగుతోంది...హైపర్ ఆదికి మహిళా ప్రేక్షకుల ఒత్తిడి..

హైపర్ ఆది, దొరబాబు

దొరబాబు చేసే పనులు తన కెరీర్ కు అడ్డంగా మారే అవకాశం ఉన్నట్లు ముఖ్యంగా దొరబాబును కంటిన్యూ చేస్తే మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ తన స్కిట్స్ చూసే వీలుండదు అని సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

  • Share this:
    సెక్స్ రాకెట్ కుంభకోణంలో దొరబాబు దొరికిపోయాక హైపర్ ఆదికి కష్టాలు మొదలయ్యాయి. లాక్ డౌన్ తర్వాత చేసే కొత్త ఎపిసోడ్స్ లో దొరబాబు లేకుండా ప్లాన్ చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే హైపర్ ఆదికి పెద్ద దెబ్బేఅని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైపర్ ఆది స్కిట్స్ అన్నీ కేరక్టర్ బేస్డ్ గా ఉంటాయి. కంటెంట్ తక్కువ హడావిడి ఎక్కువ అన్న బాపతే కనిపిస్తుంది. అయితే హైపర్ ఆది స్కిట్స్ ను సగం బతికించేది.. రైజింగ్ రాజు, దొరబాబు పై వేసే పంచులే కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం దొరబాబు దూరం అయితే స్కిట్స్ లో జీవం పోతుందనే ఆందోళనలో హైపర్ ఆది కూరుకుపోయినట్లు సమాచారం. అయితే జబర్దస్త్ లో జరుగుతున్న ఈ పరిణామాలతో హైపర్ ఆది జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే హైపర్ ఆది మాత్రం దొర బాబు చేసిన తప్పుకు పెద్ద శిక్ష వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దొరబాబు చేసే పనులు తన కెరీర్ కు అడ్డంగా మారే అవకాశం ఉన్నట్లు ముఖ్యంగా దొరబాబును కంటిన్యూ చేస్తే మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ తన స్కిట్స్ చూసే వీలుండదు అని సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.
    Published by:Krishna Adithya
    First published: