Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: May 10, 2019, 1:36 PM IST
మహేశ్ బాబు శ్రీనువైట్ల
మహర్షి సినిమా గురించే ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఎలాంటి కొత్త రికార్డులకు తెరతీస్తుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. టాక్ యావరేజ్ అయినా కూడా కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఓపెనింగ్స్ వరకు ఎలాంటి ఢోకా లేనట్లే కనిపిస్తుంది మహర్షి సినిమాకు. ఇక ఇప్పుడు ఈ చిత్రంపై శ్రీనువైట్ల కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. గతంలో ఈయన మహేశ్ బాబుతో రెండు సినిమాలు చేసాడు. దూకుడు సినిమాతో మహేశ్ కెరీర్ మార్చేసిన ఈ దర్శకుడు.. ఆ తర్వాత ఆగడుతో ఎపిక్ డిజాస్టర్ ఇచ్చాడు.

మహేశ్ బాబు శ్రీనువైట్ల
ఆ తర్వాత ఆయన కెరీర్ కూడా గాడి తప్పింది. ఇలాంటి తరుణంలో మహర్షి సినిమా చూసి ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు శ్రీనువైట్ల. మహర్షి చూసాను.. ఒక సీఈవోగా, రైతుగా, విధ్యార్థిగా మూడు విభిన్నమైన పాత్రల్లో మహేశ్ నటన అద్భుతంగా ఉంది.. ముఖ్యంగా స్టూడెంట్ పాత్రలో మహేశ్ బాబు లుక్, ఎనర్జీ కొత్తగా అనిపించింది.. అదే విధంగా అల్లరి నరేశ్ నటన కూడా గుండెలకు హత్తుకునేలా ఉందంటూ ట్వీట్ చేసాడు శ్రీనువైట్ల.
దర్శకుడు వంశీ పైడిపల్లికి నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెప్పాడు వైట్ల. రైతులకు మన సానుభూతి అవసరం లేదు.. వాళ్లను గౌరవిస్తే వాళ్లే మనను సొంతవాళ్లుగా చూస్తారని ట్వీట్ చేసాడు శ్రీనువైట్ల. ఈయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మొత్తానికి ఈ మధ్య పూర్తిగా కనిపించడం మానేసిన శ్రీనువైట్ల.. ఇప్పుడు మహేశ్ బాబు సినిమాతో మళ్లీ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ అయ్యాడు. మరి దీనికి మహేశ్ ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.
Published by:
Praveen Kumar Vadla
First published:
May 10, 2019, 1:35 PM IST