హోమ్ /వార్తలు /సినిమా /

Alia Bhatt: నీ కన్నా ఇంట్లో పనిమిషి బావుంటాది... ఆలియాపై దారుణంగా ట్రోల్స్

Alia Bhatt: నీ కన్నా ఇంట్లో పనిమిషి బావుంటాది... ఆలియాపై దారుణంగా ట్రోల్స్

ఆలియా భట్

ఆలియా భట్

పెళ్లి అవ్వగానే ఆలియా షూటింగ్ మొదలెట్టేసింది. అయితే ఆలియా లుక్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెంట్, ఫేక్ స్మైల్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇటీవలే బాలీవుడ్‌లో పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్. వీరిద్దరూ పెళ్లి ఈనెలలోనే 14న ఘనంగా జరిగింది. అయితే పెళ్లి ఇలా అయ్యిందో లేదో.. ఈ జంట వెంటనే పని మొదలేట్టేసింది. హనీమూన్, వెకేషన్ ఏం ప్లాన్ చేయకుండా.. ఆలియా,రణ్‌బీర్ తమ తమ పనుల్లో బిజీగా మారారు. అయితే తాజాగా ఆలియా కనిపించిన లుక్‌ను వైరల్ భయాని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆలియా హెయిర్ స్టైల్‌పై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు ఆలియాను ససోర్ట్ చేస్తున్నారు.

ఆలియా కొత్త పెళ్లి కూతురు.. పోనీ బయట ఆ రేంజ్‌లో కనిపించకపోయినా.. కాస్త అయినా... ఆ కళ ఉండాలని జనం అభిమానులు కోరుకుంటారు. కానీ ఆలియా కనిపించిన లుక్ మాత్రం అందరికి చిరాకు తెప్పించింది. చిన్న డ్రెస్సు వేసుకొని.. ఆమె చేసిన హెయిర్ స్టైల్ పై మండిపడుతున్నారు. బ్లూ కలర్ లూస్ టాప్ లో మధ్య పాపిడి తీసి.. పైకి ముడి(బన్) పెట్టి కనిపించింది. ఇక దీంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నువ్వేమైనా దీపికావా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలామంది దీపికాను కాపీ చేసిందని కామెంట్లు చేస్తున్నారు.


ఏంటి అలియా.. దీపికా లా తయారయ్యావ్ అని కొందరు అంటుండగా.. రణబీర్ ఇంకా దీపికను మర్చిపోలేకపోతున్నాడేమో.. అందుకే ఆమెలా రెడీ అవుతుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే దీపికా పెళ్లి తరువాత ఎక్కువగా ఇదే హెయిర్ స్టైల్ లో కనిపిస్తుంది. దీంతో అలియా, దీపికాను ఫాలో అవుతుందని, భర్త కోసమే ఇదంతా చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఆలియాపై దారుణమైన కామెంట్లు చేశారు.

ఓ నెటిజన్ అయితే.. మిస్టర్ ఓవర్ కాన్ఫిడెంట్,మిస్టర్ మ్యాడ్,మిస్టర్ క్లోక్, మిస్టర్ ఫేక్ స్మైల్, మిస్టర్ ఎరోగెంట్’ అని ఆలియాపై కామెంట్ చేశారు. కొందరు అయితే ముసలమ్మ అన్నారు. మరో నెటిజన్ ‘ ఈమె కొత్త పెళ్లికూతురా ? ఈమె కంటే ఆమె ఇంట్లో పనిమనిషి బావుంటుందేమో ’ అంటూ ఘోరంగా పోస్టు పెట్టారు. రణ్‌బీర్ కపూర్ ఏం ఆలోచించి ఈమెను పెళ్లి చేసుకొని ఉంటాడు? అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా ఆలియాను చూసిన వారంతా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

First published:

Tags: Alia Bhatt, Deepika Padukone, Ranbir Kapoor

ఉత్తమ కథలు