• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DONKEY MARCH AGAINST TANDAV IN BIHAR LJP DEMAND APOLOGISE MS

Tandav Controversy: క్షమాపణలు చెప్పినా తాండవ్ కు తప్పని తిప్పలు.. గాడిదలతో ర్యాలీ

Tandav Controversy: క్షమాపణలు చెప్పినా తాండవ్ కు తప్పని తిప్పలు.. గాడిదలతో ర్యాలీ

‘తాండవ్’ వెబ్ సిరీస్‌ (Twitter/Photo)

ఈ సినిమాపై బీహార్ లోనే గాక మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో నిరసనలు హోరెత్తుతున్నాయి. చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో లపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవలే ముంబైలో కూడా చిత్ర బృందంపై కేసు ఫైల్ అయింది.

  • News18
  • Last Updated:
  • Share this:
    అమోజాన్ ప్రైమ్ వీడియోస్ పై విడుదలైన దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతున్న తాండవ్ సినిమాకు తిప్పలు తప్పడం లేదు. ఈ చిత్రంలో హిందూ దేవతలను, దళితులను అవమానపరిచారంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాపై నిషేధం విధించాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రెండ్రోజుల క్రితమే ఈ సినిమా ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసినట్టయితే తమను క్షమించాలని.. అంతేగాక సదరు వివాదాస్పద సీన్లను సినిమా నుంచి తీసేస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ దేశ వ్యాప్తంగా దీని మీద నిరసనల హోరు మాత్రం ఆగడం లేదు. తాజాగా బీహార్ లో ఈ సినిమాకు నిరసనగా గాడిదలతో ర్యాలీ తీశారు.

    బీహార్ లోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఆధ్వర్యంలో పాట్నాలో గాడిదలతో నిరసన చేపట్టారు. గాడిదల మెడలో ఈ చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, ప్రధాన పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్ ఫోటోలను వేసి నిరసన తెలిపారు. అంతేగాక.. వారి ఫోటోలపై దేశ ద్రోహి, హిందూ విరోధి అని రాసి ఊరేగించారు. తాండవ్ సినిమా ద్వారా సమాజంలో విభజన సృష్టిస్తున్నారని... ఈ సినిమాను నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.

    తాండవ్ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీ ఖాన్ (Twitter/Photo)


    హిందూ దేవుళ్లను అపహస్యం చేసేలా ఈ సినిమాలో డైలాగులున్నాయని అందువల్లే తాము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్టు ఎల్జేపీ నాయకులు తెలిపారు. విశ్వాసాలను ఎగతాళి చేయడాన్ని తమ పార్టీ చూస్తూ సహించదని  హెచ్చరించారు. పాట్నాతో పాటు గోపాల్ గంజ్ జిల్లాలో కూడా భారతీయ విద్యా పరిషత్ సభ్యులు ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

    కాగా.. ఈ సినిమాపై బీహార్ లోనే గాక మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో నిరసనలు హోరెత్తుతున్నాయి. చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో లపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవలే ముంబైలో కూడా చిత్ర బృందంపై కేసు ఫైల్ అయింది. జనవరి 15న అమోజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్ లో డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్ అయూబ్, సారా జైన్ డయాస్, తదితరులు నటించారు. అలీ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు