Home /News /movies /

DOCTORS KNEE SURGERY TO NANDAMURI BALA KRISHNA SB

Balakrishna: ఆస్పత్రిలో బాలకృష్ణ.. అభిమానుల్లో ఆందోళన

బాలకృష్ణ కాలికి సర్జరీ

బాలకృష్ణ కాలికి సర్జరీ

ఆయన ఆస్పత్రిలో ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆయనకు ఏమైందని అభిమానులు ఆందోళన పడుతున్నారు.

    నట సింహం నందమూరి బాలకృష్ణకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. తండ్రి ఎన్టీఆర్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలయ్య తనకంటూ నటనలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో బాలయ్య కొత్త సినిమా వస్తుందంటే చాలు నందమూరి అభిమానులకు  పండగ. అలాంటి బాలకృష్ణ ప్రస్తుతం  ఆస్పత్రిలో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఆందోళన పడుతున్నారు. తాజాగా బాలయ్య ఆస్పత్రిలో డాక్టర్స్‌తో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. అందులో బాలకృష్ణ మోకాలికి కట్టు వేసి ఉంది. దీంతో ఆయనకు ఏం జరిగిందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

    వివరాల్లోకి వెళ్తే.. బాలకృష్ణకు మరోసారి  శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు. గత కొన్నిరోజుల నుంచి బాలకృష్ణ మోకాలి నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. దీంతో డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ నిర్వహించారు. ఆయనకు మోకాళ్ల నొప్పికి శస్త్రచికిత్స చేశారు. బాలకృష్ణ కు జరిగింది మైనర్ సర్జరీనేనని, ఆయన ఆరోగ్యం పూర్తిగా బావుందని వైద్యులు తెలిపారు. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, కొద్దిరోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. ప్రస్తుతం హాస్పిటల్ లో వైద్యులతో పాటు బాలయ్య కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో బాలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

    ఇటీవలే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. మోకాలి సర్జరీ వలన ఆ సినిమా షూటింగ్ కొన్నిరోజులు పాటు వాయిదా పడనుందేమో చూడాలి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Balakirshna, Nandamuri balakrishna

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు