Dr. Rajasekhar as Shekhar : కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. ఇక హీరోగా వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ (PSV Garudavega) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు రాజశేఖర్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. అంతేకాదు ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత కోలుకున్నారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా ‘శేఖర్’ అనే కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా లుక్‌ను విడుదల చేసారు. ఈ సినిమాు లలిత్ అనే కొత్త దర్శకుడుతో ప్రారంభమైన జీవితా రాజశేఖర్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాను వేరే నిర్మాతలతో కలిసి రాజశేఖర్ కూతుళ్లైన శివానీ, శివాత్మిక నిర్మిస్తున్నారు.
హీరోగా రాజశేఖర్‌కు 91వ సినిమా. ‘శేఖర్’ (Shekar) మూవీ మలయాళంలో హిట్టైన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ‘శేఖర్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.
Check out the intense #Shekar#ShekarGlimpse ? https://t.co/KWNG27KvDp@ActorRajashekar #JeevithaRajashekar @Rshivani_1 @ShivathmikaR #MallikarjunNaragani @anuprubens @LakshmiBhupal @Ananthkancherla @PegasusCineC @TaurusCinecorp @Ticket_Factory pic.twitter.com/tFOXA7Kb9l
— Haricharan Pudipeddi (@pudiharicharan) November 25, 2021
విడుదలైన ఈ గ్లింప్స్‌లో అరకుతో ఓ బంగ్లాలో ఓ వృద్ధ దంపతులను ఎవరో హత్య చేస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్పటికే రిటైర్ అయిన శేఖర్ అనే పోలీస్ ఆఫీసర్ సాయం తీసుకుంటారు. ఈ సినిమాలో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు.
బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సిగరెట్ వెలిగించి బుల్లెట్ బండిపై వచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. ఈ సినిమాలో రాజశేఖర్ మరో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ముస్కాన్, అను సితార కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్‌కు హిట్ అనేది కంపల్సరీ. ఈ సినిమా కోసం రాజశేఖర్ 59 యేళ్ల వయసులో కొన్ని రిస్కీ షాట్స్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఔట్ పుట్ పై రాజశేఖర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడట.
Kollywood Heroes In Tollywood : రజినీ,కమల్, సూర్య సహా తెలుగులో సత్తా చూపెట్టిన హీరోలు..
ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర్ కి తప్పనిసరిగా హిట్ కావాలి, అందుకే ఈ సినిమా కోసం కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడట ఈ సీనియర్ హీరో. నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది.
కానీ, ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో రాజశేఖర్ ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నారు. మరోవైపు రాజశేఖర్ కిరణ్ అనే డైరెక్టర్ దర్శకత్వంలో 92వ సినిమా చేస్తున్నారు. ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ అనే విషయం అర్ధమవుతుంది.
రాజశేఖర్.. వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘మర్మాణువు’ అనే టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో ఒక పుర్రెకు తలపాగా చుట్టారు. ఈ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు. ఈ సినిమాను కూడా రాజశేఖర్ వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajasekhar, Shekar Movie, Tollywood