Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ మరింత ప్రశ్నార్థకంగా మారింది. దీప, కార్తీక్ లు కలుస్తారన్న ఆశలు వదులుకున్నారు అభిమానులు. ఇక మళ్లీ మొదటికి వచ్చిన కథపై అభిమానులు పలు రకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే కార్తీక్, దీప ల దగ్గరికి మోనిత వచ్చి తనకు జరిగిన దానికి న్యాయం చేయమంటూ కార్తీక్ ని అడుగుతుంది. దీప గురించి తన ఓపిక గురించి మాట్లాడుతుంది. ఇక కార్తీక్ 10 రోజుల గడువు ఇస్తూ అక్కడున్న గోడపై పది గీతలు గీసి అందులో ఒక గీతను కట్ చేసి మిగిలిన తొమ్మిది రోజులు అంటూ లేదంటే ఏం చేస్తానో చెప్పను అని మీ ఫ్యామిలీ గడగడా వణికి పోయారు చేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. కార్తీక్ ఆ మాటలకు ఏమి సమాధానం ఇవ్వడు. ఇక దీప మాత్రం కార్తీక్ ను కోపంగా చూస్తోంది. ఇక అక్కడి నుంచి మోనిత వెళ్తూ వెళ్తూ దీప ను జాగ్రత్తగా ఉండాలంటూ రేపు పురుడు పోవాల్సింది నువ్వే అంటూ వెళ్తుంది. ఇక భాగ్యం తన భర్తతో.. దీప దగ్గరికి వెళ్తానని కార్తీక్ తో రాజీపడమని చెప్పి వస్తానని అనగా
వద్దు అంటాడు.
అంతలో పిల్లలు ఆడుకుంటూ మోనిత గీసిన గీతలు చూస్తూ ఏంటని ప్రశ్నలు వేస్తుంటారు. ఇక దీప, కార్తీక్ పిల్లల ప్రశ్నలకు షాకవుతారు. వెంటనే పిల్లలు ప్రశ్నించగా కార్తీక్ నేనే గీశాను అంటూ అది నా భవిష్యత్తు అని కొన్ని మాటలు అనగా పిల్లలు అర్థం కాక అక్కడి నుంచి వెళ్లి పోతారు. సౌందర్య.. ఇక ఆలోచనలోనే ఉంటుంది. అంతలో గతంలో దీపకు కార్తీక్ ఇద్దామనుకున్న శ్రీ శ్రీ పుస్తకం సౌందర్య కంట పడగా అందులో చూసి కార్తీక్ ఎప్పుడు ఇద్దామనుకున్నాడు అని ఆలోచిస్తుంది. ఇదే ఆధారాన్ని కార్తీక్ ముందు ఉంచి కార్తీక్ అని నిలదీస్తే దీప పవిత్రత అనే విషయం కార్తీక్ కు ముందే తెలిసిందని బయట పడుతుంది. ఇక కార్తీక్ ని ఏమనాలో అని బాధపడుతుంది.
ఇక కార్తీక్ మోనిత ఇంటి దగ్గరికి వెళ్లి 10 రోజుల గడువు గురించి మాట్లాడుతాడు. మన మధ్య జరిగింది ఇష్టంతో నో, ప్రేమతోనే జరిగింది కాదు అంటూ అనగా ఏం తెలియనట్లు ఎలా ఉండమంటావ్ అని నేను ఆడపిల్లలే అంటూ పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యానంటే నా క్యారెక్టర్ ఏమి కావాలి అంటూ పెళ్లి చేసుకొని భార్య స్థానంలో ఉంచమని అంటుంది. ఇక కార్తీక్ ప్లీజ్ అని బతిమాలుతూ ఏం అనలేక పోతాడు. కార్తీక్ మాటలను బట్టి అబార్షన్ చేయించుకోమని అంటావా అని అర్థం చేసుకున్న మోనిత కార్తీక్ పై మండిపడుతుంది. మొత్తానికి కార్తీక్ జీవితం మాత్రం అర్థం కాని పరిస్థితిగా మారింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.