హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: రసవత్తరంగా మారిన కార్తీకదీపం.. పక్క ప్లాన్ తో మోనిత షాకింగ్ ట్విస్ట్?

Karthika Deepam: రసవత్తరంగా మారిన కార్తీకదీపం.. పక్క ప్లాన్ తో మోనిత షాకింగ్ ట్విస్ట్?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న ఈ సీరియల్ కు విపరీతమైన అభిమానం ఉంది. ఇక మోనితను విచారించడానికి కోర్టులో హాజరుపర్చిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న ఈ సీరియల్ కు విపరీతమైన అభిమానం ఉంది. ఇక మోనితను విచారించడానికి కోర్టులో హాజరుపర్చిన సంగతి తెలిసిందే. కోర్టులో లోపలికి ఎంట్రీ ఇచ్చిన మోనిత.. కార్తీక్, దీప సంతోషంగా ఉండటానికి తట్టుకోలేకపోతుంది. వెంటనే చిచ్చుబుడ్డిలా వెలిగి పోకండి..ఆ చిచ్చుబుడ్డి కొద్దిసేపు మాత్రమే ఉంటుంది.. కానీ నేను పెట్టే చిచ్చు మాత్రం ఇంకా పెద్దగా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు శ్రావ్య, ఆదిత్య మోనితకు పడే శిక్ష గురించి మాట్లాడుకుంటారు. మోనితకు జీవితాంత కాలం శిక్ష పడాలి అని కోపంతో రగిలి పోతారు. ఇక బోల్లో నిల్చొని ఉంటుంది. ఓ లాయర్ మోనిత చేసిన తప్పులు, నేరాల గురించి వివరిస్తాడు. ఇక మోనితను కూడా తను చేసిన తప్పుల గురించి వివరించమని హెచ్చరిస్తారు. ఇక మోనిత ముందుకు పవిత్రమైన భగవద్గీత పుస్తకం తీసుకొచ్చి దేవునిపై ప్రమాణం చేసి నిజం చెప్పమని అనడంతో నో అంటూ తన దేవుడు కార్తీక్ అంటూ చూపించి మరీ చెప్పేసరికి దీప, సౌందర్య, కార్తీక్, ఏసీపీ రోషిణి కోపంగా చూస్తారు.

ఈ లోకంలో తనకు ఇతర అమితమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని ఒకరు కార్తీక్ అంటూ మరొకరు దీప అని చెబుతుంది. ఇక దీప పై ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అంటూ దీప పై ప్రమాణం చేస్తుంది. లాయర్ వచ్చి మోనిత పేరు అడగడంతో వెంటనే మోనిత కార్తీక్ అని చెప్పేసరికి లాయర్ తో సహా అందరూ ఆశ్చర్యపోతారు. ఇక లాయర్ పెళ్లికాకముందుకే మరొకరి భర్త పేరును ఎలా పెట్టుకుందో చూడండి అంటూ అంటాడు.

ఇది కూడా చదవండి:మోనిత వింత కోరికలు.. కార్తీకదీపంలో మళ్ళీ ఊహించని ట్విస్ట్?

లాయర్ మోనితను విచారించిన తర్వాత జడ్జి మోనిత నీ తరపున వాదించేవాళ్ళు ఉన్నారా అంటూ అడిగేసరికి లేరు అని నేనే వాదించుకుంటాను అని.. కార్తీక్ పై ఉన్న ఇష్టాన్ని వివరిస్తుంది. మధ్యలో లాయర్ వచ్చి.. తనకు, కార్తీక్ కు మధ్య అడ్డుగా ఉందని కార్తీక్ ప్రేమించిన అమ్మాయిని హత్య చేయించిందని అనడంతో వెంటనే రోషిణి కూడా మాట్లాడుతూ తన నోటి ద్వారనే హత్య చేయించిన విషయాన్ని తెలిపింది. కావాలంటే వీడియో కూడా ఉందని.. దీపను ఆ వీడియో చూపించమనేసరికి ఆ వీడియో డిలీట్ అయిపోతుంది. పక్క ప్లాన్ తోనే ముందే మోనిత.. రత్న సీతతో వీడియో డిలీట్ చేయించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి:పెళ్లి చేసుకోవద్దులే కార్తీక్ నాతో సహజీవనం చెయ్యు చాలు.. దిగజారిపోయిన మోనిత!

ఇక అదే పాయింట్ పై మోనిత నేను ఇష్టపడే వ్యక్తి కార్తీక్ కూడా అదే కారులో ఉన్నప్పుడు నేను ఎందుకు హత్య చేయిస్తాను అంటూ లాజిక్ గా సమాధానం చెప్పి కార్తీక్ వాళ్ళను అడ్డంగా బుక్ చేస్తుంది. ఇక లాయర్ కార్తీక్, దీపలను కూడా విచారించడానికి పిలువగా.. అంజి అనే డ్రైవర్ తో చేయించిందని అనడంతో కావాలంటే అతడిని కూడా సాక్షిగా పిలవండి అంటూ మోనిత గట్టిగా బదులు ఇస్తుంది. అంటే అంజిని కూడా ఏదో చేయించినట్లు కనిపిస్తుంది. ఇక అంజి అనే పాత్ర వీళ్లు కల్పించిన పాత్ర అంటూ వాదిస్తుంది. ఇక ఎటువంటి తప్పు చేయలేదని గట్టిగా మాట్లాడుతుంది. తన కడుపులో కార్తీక్ బిడ్డ అంటూ అనేసరికి కార్తీక్ గట్టిగా నో అని అరుస్తాడు.

First published:

Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Vantalakka

ఉత్తమ కథలు