Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతుంది. తెలుగురాష్ట్రాల్లో ఏడున్నర అయితే మరో ఛానెల్ చూడకుండా ఉండేలా సీరియల్ కొనసాగుతుంది. ఇక ఇప్పటికే వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ లో వంటలక్క ఆరోగ్యం దారుణంగా క్షిణించింది. మరి కొంత కాలం మాత్రమే వంటలక్క బతుకుతుందని డాక్టర్ కూడా చెప్పడంతో కార్తీక్ లో తెలియని ఆందోళన, బాధ ఎదురయింది.
ఇక కార్తీక్ దీప కోసం మందులు తీసుకొచ్చి తన తండ్రికి ఇస్తాడు. ఇక దీప ఇవి డాక్టర్ బాబు తీసుకువచ్చాడని తెలుసుకొని వాటిని వేసుకోవడానికి నిరాకరిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న సౌందర్య కూడా దీప ని మందులు వేసుకోమని కోరగా.. ఆయనవల్లే ఎంత బాధ పడి.. మళ్లీ ఆయన తెచ్చిన మందులు ఎలా వేసుకుంటాను అంటూ కృంగిపోతుంది.
ఇక కార్తీక్ తన ఇద్దరు పిల్లలు వచ్చి రేపు బయటికి వెళ్దాం డాడీ అలాగే అమ్మని కూడా తీసుకెళ్దామా అని అడగగా కార్తీక్ చూద్దాంలే అంటాడు. ఇక ఆ సమయంలో సౌందర్య వచ్చి ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి పంపి.. దీపా పై నీకు ఎందుకు ఇంత పంతం అంటూ కాసేపు వాదించి అక్కడి నుండి వెళ్లి పోతుంది.
ఇక కార్తీక్.. మోనిత వాళ్ళ ఇంటికి వెళ్లగా అక్కడ వాంతులతో వికారంగా ఉంటుంది. ఇక మోనిత కార్తీక్ ను దీప ఆరోగ్యం గురించి ప్రశ్నించగా.. దీప కు దగ్గరగా ఉంటూ అన్ని చూసుకోవాలంట.. ఎందుకో మనుషులకు ఇంత పంతం అంటూ కార్తీక్ అంటాడు. దీంతో మోనిత నీకు అన్ని విషయాలలో పంతమే అంటూ తనవైపు తన మాటలతో మలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ మాటలను వినలేక కార్తిక్ అక్కడినుండి వెళ్లిపోగా.. ఆ తర్వాత మోనిత.. ఎక్కడికి వెళ్తావు తిరిగి నా దగ్గరికి వస్తావు రాజా అంటూ.. ఇప్పుడు నేను వేసిన ప్లాన్ ఎవరికీ అర్థం కాదు అంటూ.. ఇక నా ప్లాన్ సక్సెస్ అయిన రోజు అందరికీ దిమ్మతిరిగిపోతుందని, ఆరోజు నువ్వే వచ్చిన వాడిలా వాడి పోతావ్ అంటూ నవ్వుకుంటుంది మోనిత. ఇక సౌర్య.. దీప, సౌందర్య లతో తెలంగాణతో మాట్లాడిన మాటలు చెబుతోంది. ఇక ఆ మాటలు విన్న దీప అక్కడినుంచి వెళ్ళిపోగా.. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka