karthika deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ అంటే పడిచస్తారు. ఒకే కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా స్టార్ మా లో అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్.. ప్రస్తుతం రోజురోజుకు సరికొత్తగా ప్రసారం కావడంతో మరింతగా ఆకట్టుకుంటుంది.
కార్తీక్ ని సపోర్ట్ చేసిన సౌందర్య పై దీప మండిపడుతుంది. ఇక దీప ని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది సౌందర్య. కానీ.. దీప తన మొండి పట్టుదలతోనే ఉంటుంది. ఇక దీప వంట చేస్తుంటూ కార్తీక్ కు కనిపించగా.. దీప పై కోపంగా చూసి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత పిల్లలు షాపింగ్ కి వెళ్దామని అనుకుంటున్నారని దీప కార్తీక్ తో అనడంతో.. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారనీ కోపం అవుతాడు కార్తీక్. ఇవన్నీ చూస్తున్న ఆదిత్య.. కార్తీక్ ను గట్టిగా క్లాస్ తీసుకుందామని రమ్మనగా.. కార్తీక్ ఆదిత్య ఊహించుకునేది అర్థం చేసుకొని.. తనతో రౌడీని తీసుకొని వస్తాడు. దీంతో ఆదిత్య ఏమి అనలేక సైలెంట్ అయిపోతాడు.
ఇక మోనిత.. దీపకున్న సమస్య గురించి తెలుసుకోవడానికి.. డాక్టర్ భారతిని డిన్నర్ కు ఆహ్వానిస్తుంది. ఇక తన మాటలతో భారతి తో అన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. కార్తీక్ బాధపడుతున్నాడని ఏవో సాకులు చెబుతూ దీప ఆరోగ్యం గురించి బాగా ప్రయత్నిస్తుంది. ఇక కార్తీక తో తన ప్రేమ గురించి భారతి తో చెప్పకనే చెబుతుంది. ఇక ఆ టాపిక్ ను డైవర్ట్ చేస్తూ.. మొత్తానికి దీప పరిస్థితి సీరియస్ గా ఉందంటూ అంత కార్తీక్ చేతుల్లోనే ఉందంటూ భారతి తో చెప్పించుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే మోనిత, భారతి ఒక్కటైనట్లుగా చూపిస్తారు. నువ్వు చెప్పినట్లే చేద్దాం అంటుంది భారతి. వెంటనే మోనిత తనకు థ్యాంక్స్ చెబుతున్నట్లు.. కనిపిస్తుంది. అందులో భారతి నీ ప్రేమ చరిత్రలో నిలిచిపోతుంది అనగా.. తర్వాత వీరి మాటలతో వీళ్లిద్దరు కలిసినట్టుగా ఉండగా దీపని.. ఏదో చేస్తారు అని అనిపిస్తుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.