Karthika Deepam: బుల్లితెర లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక రేటింగ్ విషయంలో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఒకే కథ తో నడిచే ఈ సీరియల్ ఇప్పటికీ అదే కథతో సాగుతుంది. ఈమధ్య ఆ కథ మరింత కొత్తదనంతో ఆకట్టుకోగా ఇక ప్రేక్షకులు ఈ సీరియల్ ను చూడకుండా ఉండలేరని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా మోనిత కు మాయ రోగం కుదరగ.. వంటలక్క ఏకంగా గుత్తివంకాయే వండేసింది.
నిన్నటి ఎపిసోడ్ లో పిల్లలు వాళ్ల అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లడానికి మమ్మీ డాడీ వస్తానే మేము వెళ్తామని మారాం చేస్తుంటారు. భాగ్యం ఇంట్లో జరగబోయే శ్రీరామనవమి పూజ కోసం సౌందర్య, పిల్లలతోపాటు శ్రావ్య, దీప కూర్చొని మాట్లాడుతుంటారు. ఇక ఆ సమయంలో కార్తీక్ రావడాన్ని గమనించి భోజనం పెట్టనా బావగారు అనగానే దీప నవ్వుతూ డాక్టర్ బాబు మీ కోసం గుత్తి వంకాయ కూర చేశాను. మీకు బాగా ఇష్టం కదా అని అంటుంది. దీంతో వెంటనే కార్తీక్ మళ్లీ కోపంతో మాలతికి జీతం రెట్టింపు చేసిన సరే మాలతి నే వంట చేయాలని గట్టిగా చెప్పేస్తాడు.
ఇక సౌందర్య కోపంతో కార్తీక్ ను తిట్టి.. శ్రీరామనవమి పూజ కోసం వెళ్లడానికి కార్తీక్ తో చెబుతుంది. దీంతో కార్తీక్ మళ్లీ కోపంతో రాను అని అనగా దీప షాక్ అవుతూ, కార్తీక్ తనను ప్రేమతో కాకుండా కేవలం హాస్పిటల్ కోసమే ఇలా నటిస్తున్నాడని అనుకుంటుంది. ఇక అక్కడినుంచి కోపంగా వెళ్లిన కార్తీక్ పిల్లలు భోజనానికి పిలుస్తారు.2 గా సమయంలో కార్తీక్ దగ్గరికి దీప భోజనం తీసుకొని వెళ్లి మీరు నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళడం కోసం తాత్కాలిక భర్తగా నటిస్తున్నారని అర్థం అవుతుంది అని తెలిపింది. ఇక కార్తీక్ తన వైపు జాలిగా చూస్తూ ఉంటాడు.
దీప్ అన్న మాటలకు కార్తీక్ కాస్త కోపంతో వెటకారం మాటలు మాట్లాడి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడొద్దని తిడతాడు. ఇక పెద్దల్లుడు రానున్న సంగతి భాగ్యం తన భర్త తో చెప్పి బాధపడుతుంది. ఇక మోనిత కార్తీక్ చెప్పిన పాయిజన్ విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. ఇక ఆ సమయంలో తనలో తాను ధైర్యం తెచ్చుకుంటూ ఏం జరుగుతుందో అన్నట్లు మాట్లాడుకుంటుంది. ఇక ప్రియమణితో టాబ్లెట్స్ తీసుకొని రమ్మని కోరగా, ఎన్నడూ లేని విధంగా టాబ్లెట్స్ మింగుతున్నారని అనగా వెంటనే ప్రియమణిపై అరుస్తుంది. దీని పాపాలు పండి ఏదో మాయ రోగం వచ్చినట్టు ఉందని ప్రియమణి మనసులో అనుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Monitha, Premi vishwanth, Shoba shetty, Telugu daily serial, Vantalakka