Home /News /movies /

Karthika Deepam: నువ్వు నోరుముయ్యి మోనిత.. నీ కడుపుకు నేను కారణం కాదు.. డాక్టర్ బాబు ఫైర్!

Karthika Deepam: నువ్వు నోరుముయ్యి మోనిత.. నీ కడుపుకు నేను కారణం కాదు.. డాక్టర్ బాబు ఫైర్!

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ట్విస్ట్ లతో బాగా ఆసక్తిగా మారింది. దీంతో ఈ సీరియల్ అభిమానులు కార్తీక్, దీప లు ఇకనైనా కలుస్తారా లేరా అనే ఆలోచనలో పడ్డారు. పైగా మోనిత షాక్ ఇచ్చిన ట్రీట్మెంట్ ను చూస్తే ఇప్పటంతల ఈ సీరియల్ శుభం కార్డు పలకదని తెలుస్తుంది.

ఇంకా చదవండి ...
    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ట్విస్ట్ లతో బాగా ఆసక్తిగా మారింది. దీంతో ఈ సీరియల్ అభిమానులు కార్తీక్, దీప లు ఇకనైనా కలుస్తారా లేరా అనే ఆలోచనలో పడ్డారు. పైగా మోనిత షాక్ ఇచ్చిన ట్రీట్మెంట్ ను చూస్తే ఇప్పటంతల ఈ సీరియల్ శుభం కార్డు పలకదని తెలుస్తుంది. ఇక మోనిత కార్తీక్ ను కారులో తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో దీప కోపంతో రగిలిపోతుంది. ఓ వైపు వారణాసి, మరోవైపు సౌందర్య ఆపే ప్రయత్నం చేస్తున్న కూడా ఎంతో ఆవేశంగా రగిలిపోతుంది.

    ఇక కార్తీక్, మోనిత రిజిస్టర్ ఆఫీస్ ముందు చేరుకున్నాక..మోనిత దిగమనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇక కార్తీక్ కు ఏం అర్థం కాకుండా బాధతో మాట్లాడుతాడు. ఇక మోనిత కార్తీక్ మాటలు పట్టించుకోకుండా తన పంతంను దక్కించుకోవడానికి గట్టిగా మాట్లాడుతుంది. సౌందర్య దీపని ఏమైంది అని ప్రశ్నించగా మోనిత వచ్చి కార్తీక్ ని తీసుకెళ్ళిందని కోపంతో రగిలిపోతుంది.

    సౌందర్య మనసులో 25 న మోనిత చెప్పిన పెళ్లి గురించి చెబితే ఏం చేస్తుందో భయపడుతుంది. ఇక రిజిస్టర్ ఆఫీసులో కూర్చున్న కార్తీక్ దీప గురించి, పిల్లల గురించి ఆలోచించిన వెంటనే వెళ్ళిపోదామని నిలబడతాడు. కానీ మోనిత మాత్రం తన మాటలతో కార్తీక్ ని తలదించుకునేలా చేస్తూ కూర్చోబెడుతుంది.

    ఇక అంతలోనే ఆఫీసర్ వచ్చి ప్రశ్నించగా మా పెళ్ళికి ఈ నెల 25న బాగుందట.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని అనడంతో ఆఫీసర్ ఈ నెల కుదరదని నాలుగు వారాల ముందే నోటీస్ లో పెట్టాలి అని దానివల్ల అంత త్వరగా ఎలా కుదురుతుంది అని అనడంతో వెంటనే మోనిత.. ఆలస్యం చేస్తే ఇతగాడు వీక్ అయ్యేలా ఉన్నాడని పైగా నేను ఇప్పుడు మూడో నెల అని ఆఫీసర్ కి షాక్ ఇస్తోంది. ఇక కార్తీక్ ఏమనలేక తలదించుకుంటాడు. బహుశా మోనిత మాటలతో కార్తీక్ పెళ్లికి సిద్ధమయ్యే లా కనిపిస్తున్నాడు. మరి దీప ఏం చేస్తుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Karthika Deepam serial, Nirupam paritala, Premi Vishwanath

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు