Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ లో ప్రస్తుతం దీప పరిస్థితి ఏంటో అర్థం అయ్యేలా లేదు. కార్తీక్ దీప ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ మోనిత చేసిన తప్పుకు ఇప్పటంతలా అది జరగదు అనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇంట్లో పిల్లలు దీప లేకపోయేసరికి కంగారు పడుతూ కార్తీక్, సౌందర్య పై అరుస్తారు. మాకు అమ్మ లేదా నాన్న ఎవరో ఒకరు ఛాయిస్ ఏనా అంటూ ప్రశ్నిస్తుంటారు. ఇక వెంటనే కార్తీక్ పిల్లల్ని తీసుకొని దీప దగ్గరికి బయలుదేరుతాడు. మోనిత ఫోన్ లో పిల్లల ఫోటోలు చూసి బాగా మురిసిపోతుంది. ఇక ప్రియమణితో ప్రెగ్నెంట్ కదా మసాలాలు తగ్గించు అని సలహాలు ఇస్తుంది. వెంటనే ప్రియమణి అనుమానంతో నిజంగా కడుపుతోనే ఉన్నారా అంటూ ప్రశ్నిస్తుంది. ఇక మోనిత సీరియస్ అవుతూ తనపై అరుస్తుంది.
దీప పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండగా మొత్తానికి కార్తీక్ పిల్లల్ని దీప దగ్గరికి తీసుకువస్తాడు. ఇక కార్తీక్ అక్కడే నిల్చొని ఆలోచిస్తుంటాడు. దీప ఇక్కడికి రావడానికి కారణం పిల్లలకు చెపుతుందేమో అని తెగ టెన్షన్ పడతాడు. ఇక పిల్లలు ప్రశ్నించగా అక్కడ కంఫర్ట్ గా లేదు అంటూ తప్పించుకుంటుంది దీప. డాడీకి కూడా ఇక్కడ కంఫర్ట్ గా ఉండదు అని ప్రశ్నించగా కార్తీక్ వైపు కోపంగా చూస్తూ కోపంగా మాట్లాడుతుంది దీప. ఇక దీపనూ భోజనం చేసావా అని ప్రశ్నించగా ఊ అంటుంది దీప. వెంటనే వెళ్లి వంటగదిలో చూడగా దీప తినలేదని తెలుసుకుంటాడు.
ఇక కార్తీక్ పిల్లలని పడుకోమని అనడంతో నువ్వు వెళ్తావా డాడీ అని ప్రశ్నిస్తారు. లేదు నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉండి పోతాను అని చెప్పగా దీప కాస్త ఆశ్చర్యంగా చూస్తోంది. మోనిత కు తను చనిపోయినట్లు కల రాగా వెంటనే ఉలిక్కిపడి లేచి అరిచి మళ్లీ చావు కలలు వస్తే మంచిదే కదా అని అనుకుంటుంది. ఇక దీపకు కార్తీక్ అన్నం కలిపి తినిపించబోతాడు. దీప కోపంగా చూడటం తో చేతిలో పెడుతూ బ్రతిమాలుతాడు. ఇక దీప తో తన మనసులోని మాటలను బయటకు చెబుతాడు. అది విన్న పిల్లలు చూసి సంతోష పడతారు. దీప.. కార్తీక్ మాటలు విని వెటకారంగా స్పందించగా ఏదో ఒకటి మాట్లాడు అని బతిమాలితాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Deepa, Doctor babu, Karthika deepam, Monitha, Nalla deepa, Premi Vishwanath, Vantalakka