Karthika Deepam: బుల్లితెరపై టీఆర్పీతో రికార్డు సృష్టించిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ కి ఏ రేంజ్ అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో డాక్టర్ బాబు వంటలక్కను కొట్టిన సన్నివేశం వైరల్ అవుతూనే ఉంది. డాక్టర్ బాబు, వంటలక్క కలిసిపోయారు అంటూ సోషల్ మీడియాలో కార్తీకదీపం అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలానే వంటలక్క ఆరోగ్యం గురించి కూడా పూజలు చేస్తున్నారు.
ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ లో వంటలక్క ఇకపై వంటలు చెయ్యకూడదని, వీలైనంత వరకు వంటలక్క విశ్రాంతి తీసుకోవాలని కార్తీక్ కి డాక్టర్ చెప్తుంది. ఎంతో జాగ్రత్తగా వంటలక్కను చూసుకోవాలని లేకపోతే తన ఆరోగ్యానికే ప్రమాదం అని డాక్టర్ చెప్తారు. దీంతో వంటలక్కను డాక్టర్ బాబు ఎంతో జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ వంటలక్క సంతోషాన్ని చూసి సౌందర్య ఆనందం వ్యక్తం చేస్తుంది.
ఇంకా మరోవైపు మోనిత ఇంటికి చేరిన డాక్టర్ బాబు నాకు ఎందుకు అబద్దం చెప్పావు అని అడగ్గానే.. నేను చెప్పిన ఎన్నో అబద్ధాల్లో ఏ అబద్దం బయట పడిందంటూ మనసులో అనుకోగా.. దీప వాళ్ళు ఆ ఊరిలో ఉన్నారు అని తెలిసిన నాకు ఎందుకు చెప్పలేదు.. నా దగ్గర ఎందుకు నిజం దాచావు అంటూ కోపాన్ని వ్యక్తం చేస్తాడు డాక్టర్ బాబు. అంతేకాదు.. గతంలో ఎప్పుడైనా అబద్దం చెప్పిన, భవిష్యేత్తులో ఏదైనా అబద్దం చెప్పినట్టు తెలిస్తే నిన్ను జీవితంలో క్షమించను అంటూ మోనితకు చమటలు పట్టిస్తాడు డాక్టర్ బాబు. మరి రేపటి ఎపిసోడ్ లో మోనిత ఏం చేస్తుందనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika deepam, Premi Vishwanath, Telugu daily serial, Vantalakka