Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారింది. ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ సమయాన్ని అస్సలు మిస్ చేయట్లేదు. కథ మొత్తం అడ్డం తిరగడంతో మళ్లీ మొదటికి వచ్చింది. కానీ ఆసక్తిగా ఉంది. ఇక కార్తీక్ ను వదిలి దీప శ్రీ రామ్ నగర్ కి వచ్చేస్తుంది. ఇలాంటి ఘటన జరిగినందుకు సౌందర్య.. కార్తీక్ పై బాగా మండిపడుతుంది. ఇక పిల్లలు ఇంటికి రావడం తో షాక్ అవగా అమ్మ ఏది అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇక సౌందర్య పిల్లలకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపిస్తుంది.
మురళి కృష్ణ జరిగిందంతా భాగ్యానికి చెబుతారు. ఇక అదే సమయంలో మోనిత వాంతులు చేసుకుంటుంది. ప్రియమణి మీది ఎవరి పోలిక అంటూ కొన్ని ప్రశ్నలు వేస్తుంది. మోనిత వాటికి తగ్గట్టు సమాధానం చెబుతూ మరో ఆరు నెలలో తన పోలికలతో ఉన్న మరో ప్రాణి భూమి మీద పడుతుందని చెబుతుంది. ఇక కార్తీక్ ఒప్పుకుంటాడా అని ప్రశ్నించగా చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని అంటుంది మోనిత. ఇక దీప దగ్గరికి సరోజ తన మరిది లక్ష్మణ్ గురించి వచ్చి మాట్లాడుతుంది. ఇక దీప లక్ష్మణ్ గురించి మరింత ఆలోచిస్తూ కార్తీక్ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది.
ఇక సౌర్య దీప గురించి వెతుకుతుంది. దీప బట్టలు లేకపోయేసరికి దీప ఇంట్లో లేదు అని తెలుసుకుంటుంది. వెంటనే సౌర్య ఆలోచనలో పడుతుంది. కార్తీక్ ని నిలదీయాలి అనుకుంటుంది. కానీ అదే సమయంలో సౌందర్య, కార్తీక్ ను దీప గురించి నిలదీస్తుంది. అమ్మ ఎక్కడికి వెళ్లిందని సౌర్య ప్రశ్నిస్తుంది. ఇక హిమ కూడా నిజం తెలియడంతో కార్తీక్ ను గట్టిగా అడుగుతుంది. పక్కనే ఉన్న సౌందర్యని కూడా గట్టిగా అడుగుతుంటారు పిల్లలు. అమ్మకి బాగుండే దాకా ఇక్కడే ఉండమని తను ఆరోగ్యం కోల్పోయాక మళ్లీ బయటికి పంపించావా అంటూ ఎమోషనల్ డైలాగులతో తో కార్తీక్ ను ప్రశ్నిస్తారు, అమ్మ ఎక్కడికి వెళ్లిందని బతిమాలుతూ ఉంటారు. ఇక సౌందర్య, కార్తీక లు బాగా ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Deepa, Doctor babu, Karthika deepam, Monitha, Nalla deepa, Premi Vishwanath, Vantalakka