• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DOCTOR BABU SAYS SHOCKING NEWS TO SOUNDARYA IN KARTHIKA DEEPAM TELUGU SERIAL NR

Karthika Deepam: సౌందర్యకు గుండెబద్దలయ్యే వార్త చెప్పిన డాక్టర్ బాబు..?

Karthika Deepam: సౌందర్యకు గుండెబద్దలయ్యే వార్త చెప్పిన డాక్టర్ బాబు..?

karthika deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారటంతో ప్రేక్షకులు సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు.

  • Share this:
    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారటంతో ప్రేక్షకులు సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు. ఇక దీపా అనారోగ్యంతో బాధపడుతుండగా కార్తీక్ చేతుల మీదుగా హెవీ డోస్ టాబ్లెట్ వేయించేలా చేస్తుంది మోనిత. ఇక కార్తీక్ ఇచ్చిన టాబ్లెట్ కాదనక దీప వేసుకుంటుంది. ఆ తర్వాత సీతారాముల కళ్యాణం కోసం పెళ్లి పీటలపై కార్తీక్, దీప కూర్చుంటారు.. వరకి నిన్నటి ఎపిసోడ్ లో చూశాము.

    ఇక ఈ రోజు 1027 ఎపిసోడ్ కి వెళ్తే.. కళ్యాణం జరుగుతున్న సమయంలో మోనిత ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తున్న సౌందర్య. ఇక టాబ్లెట్ వేసుకుని ఎందుకు దీప మెల్ల మెల్లగా తల తిరుగుతున్నట్లుగా అనిపించడంతో వెంటనే కార్తీక్ భుజంపై పడిపోతుంది. కార్తీక్ భయపడి దీపా దీపా అని లేపడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే హాస్పిటల్ కు దీప ను తీసుకుని మోనిత, భారతితో కలిసి బయలుదేరుతాడు. ఇక సౌందర్య ను పిల్లలతో ఇంటికి వెళ్ళమని కార్తీక్ చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. ఇక సౌందర్య దేవుడి ముందు నిల్చొని కాపాడమని వేడుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.

    ఇక కార్తీక్ దీపలను చూసి మోనిత కాస్త వెటకారంగా ఏమిటో ఈ కష్టాలు అని అనడంతో.. వెంటనే కార్తీక్ కోపంతో చూసేసరికి ఆ మాట ను కవర్ చేస్తుంది. ఇక తన మనసులో అనుకునేవి అనుకుంటూ.. తెగ సంబరపడుతుంది. ఇక సౌందర్య కుటుంబం మొత్తం ఇలా జరగడానికి రకరకాల ఆలోచనలు చేస్తారు. ఇక సౌందర్య దీపకి ఇలా జరగడానికి కారణం ఏంటో అని ఆలోచిస్తుంది. ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినాక దీపని ఇంటికి తీసుకు వెళ్తున్న సమయంలో మోనిత వచ్చి మళ్లీ చిచ్చు పెడుతుంది. దీంతో దీప ఆమె వైపు కోపంగా చూడగా అక్కడ నుంచి కారులో దీపను తీసుకొని బయలుదేరుతాడు.

    ఇక ఇంటికి వెళ్ళాక దీప ని పట్టుకొని పిల్లలు ఏడుస్తుంటారు. ఇక కార్తీక్ ఏడవద్దు అమ్మకు ఏమి కాకుండా చూసుకుంటాను అని అని అంటూ వాళ్లపై గట్టిగా అరుస్తాడు. ఇక సౌందర్య అలా అరుస్తున్నావ్ ఏంటి అని ప్రశ్నిస్తుంది. ఇక దీప కాస్త ఎమోషనల్ తో ఒక మాట అనేసరికి వెంటనే కార్తీక్ తిట్టకుండా వదిలేసి సైలెంట్ అయిపోతాడు. ఇక దీపను అక్కడినుంచి తీసుకెళ్లాక కార్తీక్ మరింత కోపంతో వినకుండా వద్దన్న పనులు చేసిందంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

    ఇక తన ప్లాన్ గురించి మోనిత ఆలోచిస్తూ.. గట్టిగా అరుస్తుంది. ఇక తర్వాత ఎపిసోడ్ లో సౌందర్య దీప ఆరోగ్యం గురించి కార్తీక్ ను నిలదీస్తుంది. గట్టిగా ఏమైంది అరవడంతో అప్పుడు కార్తీక్.. నీ కోడలు బ్రతకదని డాక్టర్లు చెప్పారు అని చెబుతాడు. ఇక దీప కూడా తనకు ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నిజం తెలిసిన సౌందర్య తర్వాత ఏం చేస్తుందో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.
    Published by:Navya Reddy
    First published: