Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ లో మొత్తానికి దీప, కార్తీక్ లు కలుసుకున్నారన్న సంతోషంలో ఇక ఈ సీరియల్ శుభం కార్డు పలుకుతుందన్న సమయంలోనే మళ్ళీ కథను మొదటికి తీసుకొచ్చాడు డైరెక్టర్. అది కూడా మోనిత ప్రెగ్నెంట్ అనే విషయాన్నే మోసుకొచ్చాడు. దీంతో ఇక ఎప్పటికీ కార్తీక్, దీప లు ఈ జన్మకు కలుసుకోరేమోనని అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. కార్తీక్ వల్లే గర్భవతిని అయినా అని మోనిత అనడంతో ఇక దీప ఏమి చేయలేక ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. దీప లేకపోయేసరికి కార్తీక్ దీపని మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా దీప మాటలతో కార్తీక్ కు ఇక దీప తనను క్షమించదని అనుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
కార్తీక్ ఇంటికి వెళ్లేసరికి సౌందర్య ని చూసి తలదించుకుంటాడు. నా కొడుకు శ్రీరాముడు అని మురిసిపోయాను కానీ ఇలా చేస్తాడని ఊహించలేదు అంటూ బాధ పడుతుంది సౌందర్య. కార్తీక్ కూడా ఇది ఊహించలేదు మమ్మీ అంటూ తెగ బాధ పడతాడు. ఇక సౌందర్య ఎన్నో మాటలతో పొగిడిన కార్తీక్ ను తలుచుకొని ఇప్పుడు ఇలా చేశాడని కార్తీక్ తో చెప్పుకుంటూ బాధపడుతుంది. ఇక కార్తీక్ ఇది కావాలని చేయలేదు అంటూ ఏదో పొరపాటు వల్ల జరిగింది అని తెలిపాడు. సౌందర్య తన మాటలు అర్థం చేసుకొని మోనిత మంచిది కాదని అది కాపురంలో నిప్పులు పోసే ఆడదని ఎంతటి దానికైనా దిగజారుతుందని.. కానీ నువ్వు చేసిన తప్పు మాత్రం ఎప్పటికీ మచ్చనేనని అంటుంది సౌందర్య.
ఇక మీ నాన్నగారు ఫోన్ చేశారని పిల్లలు ఇక్కడికి వస్తారని మారం చేస్తున్నారని కార్తీక్ తో అంటుంది సౌందర్య. ఇక కార్తీక్ తెగ భయపడిపోతాడు. సౌందర్య నిజం ఏం చెప్పనులే అంటూ కార్తీక్ ను ఓదారుస్తుంది. ఇక కార్తీక్ ను భోజనం చేయడానికి రమ్మంటుంది సౌందర్య. ఇక దీప ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో.. గతంలో కార్తీక్ దగ్గర గుండె ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వచ్చి దీపని పలకరిస్తాడు. ఇక దీప తో కాసేపు మాట్లాడి ప్రస్తుతం పరిస్థితులవల్ల బయటకు వెళ్లట్లేనని కార్తీక్ తో చెప్పి తన ఆరోగ్య పరిస్థితి మళ్లీ ఒకసారి చెక్ చేయమని దీపతో అంటాడు. ఇక దీప టైం కావాలి అంటుంది. ఇక తను ఆగుతాను అంటూ కానీ నా గుండె ఆగకుండా చూడండమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దీప అతని పరిస్థితి అర్థం చేసుకొని కార్తీక్ తో సాయం అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీప కార్తీక్ ను కలుస్తుంది లేదో చూడాలి. ఇక హిమ, సౌర్య సడన్ గా ఇంటికి వచ్చేస్తారు. వాళ్లను చూసి ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. ఇక వెంటనే అమ్మ ఏది అంటూ ప్రశ్నించగా అందరూ మళ్లీ షాక్ అవుతారు. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Deepa, Doctor babu, Karthika deepam, Monitha, Nalla deepa, Premi Vishwanath, Vantalakka