Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ మళ్లీ మొదటికి వచ్చింది. చూస్తుంటే ఆసక్తిగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మళ్లీ ఏం జరుగుతుందో అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ దీప, కార్తీక్ లు కలుస్తారా లేదా అని అనుమానం మొదలవుతుంది. ఇక పిల్లలు.. కార్తీక్ ను నువ్వు ఇక్కడికి రావా నాన్న అనగా ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి బయలు దేరుతాడు. ఇక తెల్లారి నిద్ర లో నుంచి లేచిన హిమ పాలు మాడిన వాసన రావడంతో వంటగది లోకెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి దీప దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అమ్మా అంటూ, నాన్న ఎందుకు అలా ఉంటున్నాడని ప్రశ్నిస్తుంది. ఇక తన ప్రశ్నలకు జవాబు చెప్పలేక అక్కడి నుంచి వెళ్లి పోతుంది దీప. దీంతో హిమ, సౌందర్య మాట్లాడుకుంటుండగా దీప విని బాధపడుతుంది.
కార్తీక్ పిల్లలను తీసుకొని రానందుకు సౌందర్య తెగ ఆలోచిస్తుంది. ఇక కార్తీక్ బ్యాగ్ తీసుకొని కిందికి వస్తుండగా శ్రావ్య టిఫిన్ కోసం ప్రశ్నించగా మా ఇంట్లో చేస్తాను అంటాడు. ఇక ఆ మాటకు సౌందర్య సంస్కారవంతంగా ఉందంటూ ఈ నిర్ణయం కి ఇంత సమయం పట్టిందని అంటూ మోనిత జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంది. ఏం సమాధానం చెబుతావ్ అని ప్రశ్నించగా..అబార్షన్ చేయిస్తానన్న ఉద్దేశంలో.. పరిస్థితి అంత వరకు రానివ్వను అంటాడు. దాంతో సౌందర్య కోప్పడుతూ మోనిత ఆడ బొమ్మ కాదు అంటూ మోనిత కు కార్తీక్ పై ఉన్న ప్రేమ గురించి తెలుపుతూ ఆవేశం తో ఏం చేయాలని రగిలిపోతుంది. అదే సమయంలో కార్తీక్ మోనిత పదే పదే ఫోన్ చేయగాఫోన్ స్విచాఫ్ చేస్తాడు.ఇక కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్.
కార్తీక్ ఫోన్ కట్ చేయడంతో మోనిత మరింత రగిలిపోతూ ప్రియమణిపై అరుస్తుంది. ఇక దీప పిల్లల్ని గుడికి తీసుకొని వెళ్ళి వస్తుంది. ఇంటి దగ్గర జనతా హాస్పిటల్ అంటూ ఓ బోర్డు పెట్టగా అది చూసి దీప, పిల్లలు షాక్ అవుతారు. బయటికి వచ్చిన కార్తీక్ ని చూసి ప్రశ్నిస్తారు పిల్లలు. ఇక్కడే ఉంటూ వైద్యం చేసుకుంటానని తెలుపుతాడు. దీంతో పిల్లలు సంతోషంగా ఫీల్ అవుతారు. అంతలోనే సౌర్య తన నాన్న మంచివాడని చిన్నప్పుడే చూసాం అంటూ అప్పుడు బలభద్రపురం లో ఉన్నప్పుడు మోనిత ఆంటీ కూడా వచ్చిందని అనగా కార్తీక్, దీప ముఖంలో రంగులు మారుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Deepa, Doctor babu, Karthik, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Vishwanath, Vantalakka