DOCTOR BABU REVEALS TRUTH AND FIRE ON VANTALAKKA IN KARTHIKA DEEPAM SERIAL TODAYS EPISODE NR
Karthika Deepam: వంటలక్కను కడిగిపారేసిన డాక్టర్ బాబు.. మోనిత ఎలా మారిపోయిందో తెలుసా?
karthika deepam
Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం చాలా ఉత్కంఠగా మారింది. కథ ఎప్పుడు ఎండింగ్ అవుతుందో తెలియదు కానీ మధ్యలో ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను బాగా ఎదురుచూసేలా చేస్తుంది. ఇక మోనిత దీపకు వీడియో కాల్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే.
Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం చాలా ఉత్కంఠగా మారింది. కథ ఎప్పుడు ఎండింగ్ అవుతుందో తెలియదు కానీ మధ్యలో ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను బాగా ఎదురుచూసేలా చేస్తుంది. ఇక మోనిత దీపకు వీడియో కాల్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. సౌందర్య కూడా పక్కన ఉండటంతో కార్తీక్ ని ఇరికించి కావాలని చేసి ఉంటుందేమో అని సౌందర్య అని అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక కార్తీక్ కారు మధ్యలో పాడవడంతో వీడియో కాల్ గురించి తలుచుకుంటూ వస్తుంటాడు. సౌందర్య తన కారు ఆపి కార్తీక్ ని ప్రశ్నిస్తుంది. ఇక కార్తీక్ తనలో ఉన్న బాధను మొత్తం మళ్లీ సౌందర్య కు చెబుతాడు. సౌందర్య కూడా కార్తీక్ బాధను అర్థం చేసుకోని అంతే జాలిగా మాట్లాడుతుంది.
ఇక పిల్లలు భాగ్యం తో అమ్మ నాన్న లు ఎందుకు విడిపోయారు అని ప్రశ్నలు వేస్తుంటారు. ఇక భాగ్యం వారికి సరిదిద్దుతుంది. ఇక దీప దగ్గరికి కార్తీక్ వచ్చి మోనిత షాపింగ్ విషయం గురించి నాకు సంబంధం లేదు అనడంతో వెంటనే దీప కోపంతో రగిలిపోయి 25 తారీఖున పెళ్లి గురించి బయటకు కక్కుతుంది. కార్తీక్ షాక్ అవుతూ తన ప్రమేయం లేకుండా అంత జరుగుతుందని చెప్పినా కూడా దీప వినకుండా ఉగ్రరూపం దాల్చింది. ఇక కార్తీక్ అయినా కూడా ఓపికతో తన పెళ్లి గురించి తనకు కూడా తెలియదని అనడంతో దీప అసలు ఊరుకోకుండా తన మాటలతో, ప్రశ్నలతో కార్తీక్ ని కడిగిపారేస్తుంది.
పెళ్లి దాకా వ్యవహారం వచ్చిందంటే ఇందులో మీ బాధ్యత లేదని ఎలా నమ్మమంటారు అని రగిలిపోతుంది. కీలుబొమ్మగా మారావంటూ కార్తీక్ ని అంటుంది. ఇక మౌనిత ఇలా మారిపోయిందో తెలుసా అని ప్రశ్నించగా వెంటనే కార్తీక్ నువ్వు అంటున్న కీలుబొమ్మని బొమ్మ చేసి ఆడుకుంటుందని ప్రతి ఒక్క విషయంలో వేధిస్తుందని తన బాధను తెలుపుతాడు కార్తీక్. అంతేకాకుండా మమ్మీని, నిన్ను కూడా పెళ్లికి తీసుకురావాలని కండిషన్స్ పెట్టిందని తెలుపుతాడు. ఇక ఈ బాధలు ఎలా చెప్పను ఎవరికి చెప్పుకోను అంటూ చచ్చాక దేవుడితో చెప్పుకోవాలా అని అరవడంతో దీప షాక్ అవుతుంది. ఇక మొత్తానికి మోనిత తో ఎలాంటి ఉద్దేశం లేదు అంటూ నువ్వు నమ్మినా నమ్మక పోయినా ఇది నిజం అంటూ గట్టిగా చెప్పేస్తాడు కార్తీక్. ఇక ఈ రోజు కార్తీక్ తన ఎమోషనల్ తో అన్ని విషయాలు బయటకు చెబుతూ తెగ బాధ పడతాడు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.